Chhaava : ఒకే రోజు పది సినిమాలు.. కానీ అందరి దృష్టి ఆ రెండిటిపైనే

Update: 2025-03-04 11:02 GMT

ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు విడుదలైతేనే ఏం చూడాలా అని ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటిది ఏకంగా పది సినిమాలు అంటే పట్టించుకుంటారా.. పైగా అన్నీ చిన్న సినిమాలు. ప్రమోషన్ సంగతి అలా ఉంచితే ట్రైలర్స్ కూడా ఆకట్టుకునేలా లేవు. కొన్ని సినిమాలైతే ఎప్పుడో పూర్తయినట్టుగా కనిపిస్తున్నాయి. ఇన్ని సినిమాలున్నా.. ఆడియన్స్ లో మాత్రం ఓ రెండు సినిమాలపైనే క్రేజ్ ఉంది. అవే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఛావా.

సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా సమంత, అంజలి హీరోయిన్లుగా 2013లో విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి రిలీజ్ టైమ్ కంటే తర్వాత టివిల్లో ఎక్కువ అప్లాజ్ వచ్చింది. అందుకే ఈ చిత్రాన్ని ఈ నెల 7న మళ్లీ విడుదల చేస్తున్నారు. బుకింగ్స్ పరంగా చూస్తే ఫస్ట్ టైమ్ రిలీజ్ అవుతున్నంత స్ట్రాంగ్ గా ఉంది. మంచి ఓపెనింగ్స్ గ్యారెంటీ అనేలా ఉంది.

ఇక గత నెల 14న హిందీలో విడుదలై సంచలన విజయం సాధించిన ఛావాను తెలుగులో ఈ 7న విడుదల చేస్తున్నారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ కథతో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయింది. చాలామంది ప్రాంతీయ భాషల్లో చూడాలనుకుంటోన్న టైమ్ లో తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ రిలీజ్ చేస్తోంది.

మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటూనే హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు జీవి ప్రకాష్ కుమార్. అతను హీరోగా నటించిన కింగ్ స్టన్ అనే సినిమా కూడా ౭నే విడుదలవుతోంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఇండియాస్ ఫస్ట్ హారర్ మూవీ అనే  ప్రచారం చేస్తున్నారు వీళ్లు. దివ్య భారతి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కోసం లేటెస్ట్ గా నిర్వహించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గానే జరిగింది. కానీ ప్రకాష్ కు తెలుగులో నటుడుగానే గుర్తింపు లేదు. ఇక హీరోగా అంటే పట్టించుకుంటారా అనేది పెద్ద ప్రశ్న.

వీటితో పాటు శివంగి, నారి, జిగేల్, రాక్షస, నీరుకుళ్ల, వైఫ్ ఆఫ్ అనిర్వేష్, పౌరుషం అంటూ చాలా సినిమాలే విడుదలవుతున్నాయి. ఇవేవీ ఆడియన్స్ కు థియేటర్స్ కు రప్పించే సత్తా ఉన్నవిగా కనిపించడం లేదు. సో.. పేరుకు ఇన్ని సినిమాలు విడుదలవుతున్నా.. ప్రధానంగా ప్రేక్షకుల దృష్టంతా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఛావాపైనే ఉన్నాయనేది నిజం.

Tags:    

Similar News