Evaru Meelo Koteeswarulu: విజేత చేతికి కోటి రాదా..? మరి ఎంత వస్తుంది..?
Evaru Meelo Koteeswarulu: సామాన్యుడిని కోటీశ్వరుడిని చేసే చోటు ఇదే అని ఎన్‌టీఆర్ ప్రోగ్రామ్‌కు ఇంట్రడక్షన్ ఇస్తారు.;
Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరుడు.. సామాన్యుడిని కోటీశ్వరుడిని చేసే చోటు ఇదే అని ఎన్‌టీఆర్ ఈ ప్రోగ్రామ్‌కు ఇంట్రడక్షన్ ఇస్తారు. కానీ ఇప్పటివరకు కంటెస్టెంట్స్ కోటీ గెలవడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరిగింది. చెప్పాలంటే తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు మొదలయినప్పటి నుండి ఒక్కరు కూడా కోటీ రూపాయల చెక్‌ను అందుకోలేకపోయారు. కానీ తాజాగా షోలో ఆ అద్భుతం జరిగిపోయింది.
కొత్తగూడెం పట్టణానికి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ బీ రాజారవీంద్ర కోటీ రూపాయల ప్రశ్న వరకు వెళ్లడమే కాదు కోటి గెలుచుకునే ఇంటికి వెళ్లారు కూడా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఎవరు మీలో కోటీశ్వరుడు షో గురించి, రాజారవీంద్ర గురించే చర్చ నడుస్తోంది. బీటెక్ చేసిన ఆయన 2012లో పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరుడు ద్వారా కోటి రూపాయలను మాత్రమే కాదు లెక్కలేనంత గుర్తింపును కూడా సంపాదించుకున్నారు.
కోటి రూపాయలు గెలుచుకున్నంత మాత్రాన కంటెస్టెంట్‌కు మొత్తం ఇచ్చేస్తారా ఏంటి..? అన్న అనుమానం చాలామంది సాధారణ ప్రేక్షకులకు ఉంటుంది. ఒకరకంగా వారి అనుమానం కూడా నిజమే. అయితే ఇలాంటి షోలలో పాల్గొన్నప్పుడు గెలిచిన డబ్బుపై కొంత గిఫ్ట్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఐటీ యు/ఎస్ 194బి చట్టం ప్రకారం 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరుడులో రాజారవీంద్ర కోటి రూపాయలు గెలిచారు. అందులో 31.2% అంటే రూ.31,20,000 పన్ను కట్ అవుతుంది. మిగిలిన రూ.68,80,000 ఆయన చేతికి వెళ్తుంది. పన్నుకు సంబంధించిన విషయాలను కూడా ఎవరు మీలో కోటీశ్వరుడు టీమ్ చూసుకుంటుందని సమాచారం.