Sudheer Babu : మా నాన్న సూపర్ హీరో నుంచి బ్యూటీఫుల్ సాంగ్

Update: 2024-09-19 11:32 GMT

సుధీర్ బాబు హీరోగా అభిలాష్ కంకర డైరెక్ట్ చేసిన సినిమా ‘ మా నాన్న సూపర్ హీరో’. షాయాజీ షిండే, సాయి చంద్ కీలక పాత్రలు చేస్తోన్న ఈ మూవీలో ఆర్ణ హీరోయిన్. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. దసరా సందర్భంగా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు. వినగానే ఆకట్టుకునేలా మంచి మెలోడీయస్ ట్యూన్స్ తో కంపోజ్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ జే కృష్ణ.

అమ్మ లాగా నాన్న గొప్పదనం గురించిన పాటలు సినిమాల్లో తక్కువే. వచ్చిన వాటిలో కూడా ది బెస్ట్ అనిపించుకునేవీ తక్కువే. బట్ ఈ పాట సాహిత్యం పరంగా కూడా చాలా చాలా బావుంది. లక్ష్మి ప్రియాంక అందించిన సాహిత్యం చూస్తే.. మొదటి చరణంలోనే.. ‘‘నోరారా తిడితే నాన్న, చెయ్యారా కొడితే నాన్న, ఇష్టం పోనే పొదే... ఛీ అన్నా నువ్వే నాన్నా.. పో అన్నా నువ్వే నాన్నా.. ఏమన్నా నువ్వే నాన్నా.. ఇష్టం నువ్వుంటే.. ’’ అనే లైన్స్ తో నాన్నంటే ఆ కుర్రాడికి ఎంత ఇష్టమో చెబుతూనే కొట్టడం, తిట్టడం అనే మాటల ద్వారా తనయుడిని దారిలో పెట్టడమే ఉంటుందనే మీనింగ్ ఇన్ డైరెక్ట్ గా కనిపిస్తోంది.

‘‘కన్నా నా చిన్నా .. అని ముద్దుగ నువ్వే అనకున్నా.. నాకంటూ నువ్వే నిమిషానా.. ’’ అంటూ తండ్రి తనను పట్టించుకోక పోయినా తనయుడు ఆయన కోసం తపించే విధానాన్ని అద్భుతంగా రాసిందీ రచయిత్రి. అయితే ఈ పాట కేవలం నాన్న గొప్పదనం చూపించేది కాదు. ఈ సినిమాలో ఆ పాత్ర క్యారెక్టరైజేషన్ ను తెలియజేసేది. అయినా ఆకట్టుకుంది. ఇక నజీరుద్దిన్ గాత్రం కూడా వినసొంపుగా ఉంది. ఏదైనా ఈ మూవీకి సంబంధించి మొదటి నుంచి అన్నీ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడీ పాటతో ఏకంగా హిట్ కళ వచ్చేసినట్టుగా ఉంది. మరి దసరా బరిలో మా నాన్న సూపర్ హీరోతో సుధీర్ బాబు సూపర్ హిట్ కొట్టేలానే ఉన్నాడు.

Tags:    

Similar News