అల్లు అర్జున్ - సుకుమార్ మధ్య గ్యాప్ లో .. నిజమెంత..?
అల్లు అర్జున్, సుకుమార్ మధ్య గ్యాప్ అంటూ వస్తోన్న వార్తల్లో నిజమెంత..?;
టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోన్న రూమర్స్ లో ఒకటి.. అల్లు అర్జున్ ( Allu Arjun ) - సుకుమార్ ( Sukumar ) మధ్య గ్యాప్ వచ్చిందని. బన్నీ.. సుకుమార్ పై కోపంగా ఉన్నాడనీ.. తను సహకరిస్తున్నా.. సుక్కూ వినియోగించుకోవడం లేదనే కారణాలతో అతనిపై ఐకన్ స్టార్ గుస్సా అవుతున్నాడనే న్యూస్ హల్చల్ చేస్తోంది. కానీ ఇలాంటి వార్తల్లో నిజాలు ఎంత అని చూస్తే ఖచ్చితంగా అవి రూమర్స్ అనే తేలిపోతుంది. సినిమా అనేది క్రియేటివ్ సెక్షన్. కొన్నిసార్లు అనుకున్నది అనుకున్నట్టు రాకపోవచ్చు. లేదా ముందు అనుకున్న ఐడియాస్ కంటే బెటర్ థాట్స్ వచ్చి ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో అనుకోకుండానే ఆలస్యం అవుతుంది. పుష్ప 2 విషయంలోనూ అదే జరిగిందనేది అందరికీ తెలుసు.
సుకుమార్ అంటే అల్లు అర్జున్ కు ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు. ఆర్య, ఆర్య 2, పుష్ప మూవీస్ తో అతని కెరీర్ లోనే బెస్ట్ మూవీస్ ఇచ్చాడు. ఆర్య వల్లే అల్లు అర్జున్ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు అనేది అతనే చెబుతాడు. ఇక పుష్పతో అతన్ని ప్యాన్ ఇండియా స్టార్ ను చేశాడు సుకుమార్. అసలు చెబితే పుష్ప 2 గురించి మొదట వీరికీ ఐడియా లేదు. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పాటు అందుకు స్కోప్ ఉందని షూటింగ్ టైమ్ లోనే అర్థమైంది. అప్పుడే సెకండ్ పార్ట్ గురించి అనుకున్నారు. ఫస్ట్ పార్ల్ పెద్ద హిట్ కాబట్టి రెండోది అంతకు మించి ఉండాలి. అందుకే స్టోరీ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే వరకూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాస్త టైమ్ పట్టినా బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలనే కోరుకున్నారు. ఈ విషయంలో దర్శకుడిపై మైత్రీ మూవీస్ బ్యానర్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది. అటు అల్లు అర్జున్ కూడా పుష్పరాజ్ క్యారెక్టర్ ను ఈ సారి మరింత స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాడు. అందుకే సుకుమార్ విజన్ పై నమ్మకం ఉంచాడు. లేట్ అయినా బ్లాక్ బస్టర్ కంటెంట్ తోనే రావాలనుకున్నారు కాబట్టే ఆగస్ట్ 15 నుంచి పుష్ప 2 ను పోస్ట్ పోన్ చేశారు. ఇవన్నీ అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాతే తీసుకున్న నిర్ణయాలు అని చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. అది కాదని వీరి మధ్య గ్యాప్ వచ్చిందనే రూమర్స్ ను క్రియేట్ చేస్తూ.. అందుకు సుకుమార్ ను బాధ్యుణ్ని చేయాలని చూడటం మాత్రం ఖచ్చితంగా అమాయకత్వమైనా కావాలి లేదా అతి తెలివి అయినా అయి ఉండాలి.