Puneeth Rajkumar : శ్రద్ధాంజలి ఘటిస్తూనే.. పునీత్ మరణాన్ని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు...!
Puneeth Rajkumar : కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఇక లేరనే వార్త యావత్ భారతీయ సినీ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది.;
Puneeth Rajkumar : కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఇక లేరనే వార్త యావత్ భారతీయ సినీ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. వందలాది మంది అభిమానులు కంఠీరవ స్టూడియో వద్ద ఆయన సమాధిని చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు.
ఇదిలావుండగా ఆయన మరణాన్ని మాత్రం కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బెంగళూరులోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్ పునీత్ రాజ్‌కుమార్ మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా అందరికీ గుండె, ఇతర చెకప్‌లు ఉచితంగా చేస్తామని ఓ ప్లెక్సీ ఏర్పాటు చేసింది.
దానికింద చూస్తే "మా వద్దకు బీపీ. ఈసీజీ, క్రియాటిన్ లెవెల్స్, కొలస్ట్రాల్ చెకప్ చేయించుకుంటే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే" అంటూ యాడ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా పునీత్ ఫ్యాన్స్ సదరు డయాగ్నస్టిక్ సెంటర్ పైన విరుచుకుపడుతున్నారు. ఓ మంచి మనిషి మరణాన్ని ఈ విధంగా క్యాష్ చేసుకుంటారా అని విమర్శిస్తున్నారు.