పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ మధ్య కాలంలో ‘ఓ.జి’మూవీకి వచ్చినంత హైప్, క్రేజ్ మరే సినిమాకూ రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా ఏకంగా యేడాది పాటు ఆలస్యం అయినా.. క్రేజ్ డబుల్ అయిందే తప్ప తగ్గలేదు. ఈ మూవీ కంటే ముందు వచ్చిన హరిహర వీరమల్లును కూడా పట్టించుకోలేదు ఫ్యాన్స్. ఎక్కడ చూసినా ఓ.జి నామ జపం వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే సినిమాకూ బిజినెస్ యాంగిల్ లో సూపర్ ఆఫర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్శీస్ లో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అప్పుడే రికార్డులు కొల్లగొడుతోంది. భారీ హైప్ ఉన్న మూవీస్ ను కూడా దాటుకుని బుకింగ్స్ తో అదరగొడుతోంది. అంటే ఓవర్శీస్ ఫ్యాన్స్ లో ఓ.జి పై ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి అభిమానులను కాస్త డిజప్పాయింట్ చేసే న్యూస్ ఇది.
ఈ చిత్రాన్ని యూఎస్ఏలో ప్రత్యంగిరా సినిమాస్ వాళ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వారికి ఉన్న పాత కమిట్ మెంట్స్ వల్ల ఓ.జి చిత్రాన్ని అక్కడ ఐమాక్స్, డి బాక్స్ టెక్, 4డిఎక్స్, డాల్బీ ఫార్మాట్స్ లో విడుదల చేయడం లేదట. సినిమాను కేవలం ‘పి.ఎల్.ఎఫ్’ఫార్మాట్ లో అక్కడ ప్రదర్శిస్తారు. ఈ ఫార్మాట్ ద్వారా క్వాలిటీలో తేడా ఉండదు కానీ ఎక్స్ పీరియన్స్ లో తేడా ఉంటుంది. ఎంతైనా ఐమాక్స్, 4 డీ ఎక్స్ అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. ఆ ఫీల్ ను లేకుండా పోయిందిప్పుడు.
ఇక సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించాడు. ఇక ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదల కాబోతోంది ఓ.జి.