Game Changer : రామ్ చరణ్ విషయంలో మరీ ఇంత దారుణమా

Update: 2025-01-15 08:45 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను టార్గెట్ చేశారు.. గేమ్ ఛేంజర్ ను లీక్ చేశారు. కావాలని నెగెటివిటీ ప్రచారం చేస్తున్నారు అనే వార్తలు వస్తే చాలామంది ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారు. బట్ కానే కాదు. నిజంగానే గేమ్ ఛేంజర్ ను టార్గెట్ చేశారు. ఈ మూవీ అనుకున్నదానికంటే చాలా పెద్ద హిట్ కావాల్సి ఉంది. కానీ అలా జరగకుండా ఉండేందుకు చాలామంది ప్రయత్నించారు అనేది ఇప్పుడిప్పుడే బహిర్గతం అవుతోంది. లేదంటే ఓ పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన రోజునే హెచ్.డి క్వాలిటీతో ఆన్ లైన్ లో రావడం ఏంటీ..? ఏకంగా లోకల్ ఛానల్స్ లో ప్రసారం కావడం ఏంటీ..? యస్.. అత్యంత దారుణమైన విషయం ఇది అని చెప్పాలి. ఈ మూవీని ‘ఏపి లోకల్ టివి’ పేరుతో ఉన్న ఓ లోకల్ ఛానల్ లో ప్రసారం చేశారు. చూస్తే ఇది కూడా క్వాలిటీగానే ఉంది. అంటే పనిగట్టుకునే కొందరు ఇదంతా చేశారు అని అర్థం కావడం లేదూ..?

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లే సినిమా గేమ్ ఛేంజర్ అని అంతా నమ్మారు. శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఇది చరణ్ ఇమేజ్ ను వరల్డ్ వైడ్ గా మరింత పెంచుతుందని నమ్మేవాళ్లు చాలామందే ఉన్నారు. ఆ నమ్మకాన్ని బద్ధలు కొట్టి సినిమాను ఆర్థికంగా దెబ్బ తీస్తే అది హీరో ఇమేజ్ ను డామేజ్ చేస్తుందనే కొందరు ఇలా చేశారు అని అర్థం అవుతోంది.

ఏదేమైనా హీరోను టార్గెట్ చేస్తే నష్టపోయేది నిర్మాతలైన మేము కదా అని దిల్ రాజు ఆక్రోశం వెల్లగక్కాడు. అయితే అతనికి కౌంటర్ గా దేవర టైమ్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్ పేరుతో కొందరు చేసిన దుష్ప్రచారం గురించి మీరు స్పందించారా అని కౌంటర్స్ వేస్తున్నారు. బట్ అదీ తప్పే.. ఇదీ తప్పే కదా. అంతిమంగా ఇండస్ట్రీని నిలబెట్టే నిర్మాత కదా లాస్ అయ్యేది. ఏదేమైనా గేమ్ ఛేంజర్ విడుదలై వారం కూడా కాకముందే మరీ లోకల్ ఛానల్ లోకూడా ప్రసారం చేయడం అంటే అత్యంత దారుణమైన విషయం అనే చెప్పాలి. 

 

Tags:    

Similar News