Dhanush : రాయన్ స్క్రీన్ ప్లేకు అరుదైన గౌరవం

Update: 2024-08-02 09:50 GMT

ఏ సినిమాకైనా కథ ఎంత ముఖ్యమో కథనమూ అంతే ముఖ్యం. ఇంకా చెబితే ఓ సాధారణ కథను కూడా అసాధారణంగా చెప్పడం ఓ బలమైన స్క్రీన్ ప్లే వల్లనే అవుతుంది. అలా స్క్రీన్ ప్లే మ్యాజిక్ వల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాగని అన్ని కథనాలూ అద్భుతం అనిపించుకోవు. కొన్ని మాత్రమే అద్భుతం అనిపించుకుంటాయి. అలా ఇప్పుడు ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేసిన రాయన్ స్క్రీన్ ప్లే కూడా అద్భుతం అనిపించుకుంది. అయితే ఇదేమీ ఆయన అభిమానులో లేక కోలీవుడ్ పీపులో చెప్పిన మాట కాదు. ఏకంగా అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్లు చెప్పిన మాట.

ప్రతి యేటా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే అనేక సినిమాల నుంచి ది బెస్ట్ అనిపించిన స్క్రీన్ ప్లే లను తమ లైబ్రరీలో భద్రపరుస్తుంది ఈ అకాడెమీ. వాళ్లు రాయన్ మూవీ స్క్రీన్ ప్లే కూడా అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్ అండ్ సైన్స్ లైబ్రరీకి అఫీషియల్ గా సెలెక్ట్ అయింది. ఇక నుంచి ఈ స్క్రీన్ ప్లే కాపీ ఆ లైబ్రరీలో కూడా ఉంటుంది. అలా రాయన్ మూవీకి ఓ అరుదైన గౌరవం దక్కిందనే చెప్పాలి.

ఇక ధనుష్ కు ఇది 50వ సినిమా కూడా కావడంతో మరింత మెమరబుల్ అవుతుంది. అనేక లేయర్స్ తో సాగే స్క్రీన్ ప్లేను అతను బాగా రాసుకున్నాడు. అందుకే ఈ మూవీ తమిళ్ లో ఆల్రెడీ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో సరిగా ప్రమోషన్స్ చేసుకోలేదు. ఆ కారణంగా ఇక్కడ బ్రేక్ ఈవెన్ కు కూడా ఇబ్బంది పడింది. ధనుష్ తోపాటు సందీప్ కిషన్, దుషారా విజయన్, ప్రకాష్ రాజ్ నటన విమర్శకులను కూడా మెప్పించింది. చాలా రోజుల తర్వాత ఏఆర్ రహమాన్ అద్భుతమైన సంగీతంతో సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాడు. 

Tags:    

Similar News