Kamal Haasan : కమల్ హాసన్ ను ఈ సారి పవర్ ఫుల్ గా చూపిస్తారా..?

Update: 2026-02-24 11:06 GMT

లోక నాయకుడు కమల్ హాసన్ చేయని పాత్ర లేదు.. చేయలేని పాత్రా లేదు. ఎన్నో అద్భుతాలను వెండితెరపై ఆవిష్కరించాడు. హీరోగానే కాక విలన్ గానూ కనిపించాడు. అయితే ఈ సారి విలన్ గా మాత్రం సరికొత్తగా ప్రయత్నం చేయబోతున్నాడు. ఇది రజినీకాంత్ మూవీలో కాదు. ప్రభాస్ మూవీలో. యస్ కల్కి 2 ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం కమల్ తో పాటు అమితాబ్ బచ్చన్ మధ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ మూవీలో ఆయన పాత్ర ఈ సారి చాలా బలంగా ఉండబోతోందట. ఫస్ట్ పార్ట్ లో ఏదో గెస్ట్ రోల్ లో లాగా కనిపించాడు. చాలా తక్కువ సన్నివేశాల్లో మాత్రమే ఆయన కనిపించాడు. బట్ కల్కి 2లో మాత్రం చాలా పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడట.

కల్కి 2 కమల్ పాత్రకు స్కోప్ ఉంటుంది. అందుకే ఈ మూవీ విషయంలో కమల్ చాలా ప్రత్యేకతలుు తీసుకుంటున్నాడు. దాదాపు 90 నిమిషాల పాటు ఈ పాత్ర సినిమాలో ఉండబోతోంది అంటున్నారు. అంటే కమల్ ఎలాంటి గెటప్ లో కనిపించబోతున్నాడు. ఎలా ఉండబోతున్నాడు అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ అనుకోవచ్చు. బట్ 90 నిమిషాలు అంటే మాత్రం చాలా పెద్ద పాత్రే ఇది. సెకండ్ పార్ట్ లో విలన్ క్యారెక్టర్ కు చాలా ఇంపార్టెన్స్ ఉండబోతోంది అనిపించేలా ఉంది ఈ విషయం. మరి అంత సేపు కమలే కనిపిస్తే.. ఇక అమితాబ్ పాత్ర ఈసారి తగ్గుతుందా అనే డౌట్ కూడా వస్తుంది. అదే టైమ్ లో ప్రభాస్ పాత్ర విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అతను కర్ణుడుగా కనిపిస్తాడా లేక.. ఇంకేదైనా గెటప్ లో కనిపిస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News