Son of Sardaar 2 : మర్యాద రామన్న రీమేక్ కు సీక్వెల్ సన్ ఆఫ్ సర్దార్

Update: 2025-06-17 11:45 GMT

మగధీర వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన మూవీ మర్యాద రామన్న. అప్పటి వరకూ కమెడియన్ గా ఉన్న సునిల్ అంతకు ముందే అందాల రాముడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతన్ని సన్నగా మారమని చెప్పి మార్పించి మరీ సునిల్ హీరోగా జక్కన్న ఈ చిత్రాన్ని రూపొందించాడు. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా సూపర్ హిట్ అయింది. నిజానికి ఇది ‘అవర్ హాస్పిటాలిటీ’అనే మూవీ హాలీవుడ్ మూవీకి ఫ్రీ మేక్. ఆ విషయంలో కొన్ని విమర్శలు వచ్చినా సినిమా హిట్ అయిపోయింది. తర్వాత అనేక భాషల్లో ఇదే ఫార్మాట్ లో రీమేక్ అయింది.

అలాంటి మూవీకి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. అయితే తెలుగులో కాదు. హిందీలో. యస్.. మర్యాద రామన్నను హిందీలో అజయ్ దేవ్ గణ్, సోనాక్షి సిన్హా జంటగా అశ్విన్ ధీర్ డైరెక్షన్ లో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి అజయ్ దేవ్ గణే నిర్మాత కావడం విశేషం. హిందీలో అప్పుడు సన్ ఆఫ్ సర్దార్ పేరుతో రీమేక్ అయింది. ఇప్పుడు సన్ ఆఫ్ సర్దార్ 2 అంటూ సీక్వెల్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ ను విమల్ కుమార్ అరోరా డైరెక్ట్ చేయబోతున్నాడు. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఫైనల్ అయింది. నిజానికి ఈ చిత్రానికి సీక్వెల్ చేసే అవకాశం ఉంది. పారిపోయిన ఆ జంట జీవితం తర్వాత ఏమైంది.. హీరోయిన్ ఫ్యామిలీ వారితో కలిసిపోయిందా లేక ఇంకా ఇబ్బందులు పెట్టిందా అనే కోణంలో సీక్వెల్ ను నింపేయొచ్చు. కానీ కొన్ని కథలను అలా వదిలేస్తేనే బెటర్. మర్యాద రామన్న కూడా అలాంటిదే. మరి గతేడాదే ప్రారంభమైన ఈ సీక్వెల్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News