Anando Brahma : ఆ కామెడీ మూవీకి సీక్వెల్ వస్తోందా..

Update: 2024-08-06 10:34 GMT

తెలుగులో వచ్చినన్ని డిఫరెంట్ హారర్ మూవీస్ మరే భాషలోనూ వచ్చి ఉండవు. హారర్ కామెడీతో కూడా బ్లాక్ బస్టర్స్ కొట్టిన హిస్టరీ టాలీవుడ్ కు ఉంది. హారర్ కామెడీ పాట్రన్ బోర్ కొట్టినప్పుడు కాస్త డిఫరెంట్ గా ట్రై చేసి సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ఆనందో బ్రహ్మ. తాప్సీ, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని మహి వి రాఘవ డైరెక్ట్ చేశాడు. దెయ్యాలు భయపెడతాయంటే వాటినే భయపెట్టే ట్రెండ్ గా వచ్చిన మూవీ ఇది. 2017లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత మహి యాత్ర, యాత్ర2 మూవీస్ చేశాడు. సైతాన్ అనే వెబ్ సిరీస్ కూడా డైరెక్ట్ చేశాడు. ఆ మధ్య సేవ్ ద టైగర్స్ అనే సిరీస్ ను ప్రొడ్యూస్ కూడా చేశాడు.

సైతాన్ తర్వాత అతను ఆనందో బ్రహ్మ సీక్వెల్ పై ఫోకస్ చేశాడట. ఇప్పటికే స్టోరీ లైన్ పూర్తయిందని టాక్. ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారట. ఫస్ట్ పార్ట్ లో ఉన్న కాస్ట్ అంతా రిపీట్ అవుతుందని టాక్. మామూలుగా హారర్ మూవీస్ కు సీక్వెల్స్ అనేది రాఘవ లారెన్స్ మొదలుపెట్టాడు. కాకపోతే కథలు వేరే, పాత్రలు వేరే ఉన్నాయి. అతను, ఫ్యామిలీ రోల్స్ మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. అలాగే ఈ మూవీ కూడా అదే ఆర్టిస్టులతో ఓ కొత్త నేపథ్యంలో భయపెట్టే ప్రయత్నంలో రూపొందబోతోందట.

అయితే రీసెంట్ గా గీతాంజలికి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చిది అనే మూవీ ఆకట్టుకోలేదు. మరి ఆనందో బ్రహ్మ సెకండ్ పార్ట్ కూడా మెప్పిస్తందా లేక గీతాంజలి రూట్ లో వెళుతుందా అనేది చూడాలి.

Tags:    

Similar News