కపుల్ ఫ్రెండ్లీ.. ఈ మూవీ అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఫస్ట్ లుక్, టీజర్ వరకూ బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమాను కూడా విడుదల చేయబోతున్నారు అని అనౌన్స్ చేశారు. అయితే ట్రైలర్ మాత్రం బాగా ఆకట్టుకునేలా ఉంది. యూత్ ఫుల్ గా ఉంటూనే ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఒక కపుల్ చెన్నైలో ఉంటారు. ఇద్దరివీ మధ్య తరగతి బ్రతుకులే. ఇద్దరూ ఒక చిన్న ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో తెలియకుండా ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంటారు. ఓ వైపు ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలా అనుకోకుండా శారీరకంగా కూడా కలుస్తుంటారు. తర్వాత పెళ్లి గురించి అడిగిన ప్రతిసారీ అతను తర్వాతే అంటుంటాడు. మరోవైపు ఇద్దరు ఇళ్లల్లో పెళ్లి కోసం ప్రయత్నం చేస్తుంటారు. మరి తర్వాత ఏం జరిగింది అనేది మిగతా సినిమాలో తెలుస్తుంది.
బట్ ఈ ఇద్దరి కథల్లోనూ ఓ సంఘర్షణ కనిపిస్తుంది. కుటుంబ పరమైన బలమైన నేపథ్యం ఉంటుంది. రెండు కుటుంబాల్లో జరిగే సమస్యలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఘటనలు ఏంటీ అనేది ఉంటాయి. మరి ఈ కథ సింపుల్ గా కనిపిస్తూనే బలంగానూ ఉంటోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంట అద్భుతంగా ఉంది. చాలా నేచురల్ నటనతో కూడా కనిపిస్తుంది. అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ చెన్నైలో మేజర్ పార్ట్ గా చిత్రీకరణ జరిపినట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్ మాత్రం బాగా ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ మూవీతో సంతోష్ శోభన్ ఈ మూవీతో విజయాన్ని అందుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.