నెపోకిడ్స్ అనే మాట టాలీవుడ్ తో పాటు అన్ని ఉడ్స్ లోనూ వినిపిస్తుంది. దాన్ని దాటుకుని వాళ్లు నిలబడతారు కదా అప్పుడే హీరోలుగా స్టార్స్ అవుతారు. ఈ విషయంలో ఆది సాయి కుమార్ మాత్రం ఇప్పటికే ఎదురీతగానే ఉన్నాడు. మొదటి రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో అతను ఇంక స్టార్ హీరో అయిపోతాడు అనుకున్నారు. బట్ తర్వాత మారిపోయింది. ఒక్కో సినిమాతో డౌన్ అవుతూ కనిపించాడు. అన్నీ ఫ్లాపులే. కొన్నిసార్లు పాటలు బావుంటాయి.. సినిమా పోతుంది. అలా అతని సినిమాలు అంటే చాలు.. జనం లైట్ తీసుకోవడం చాలాకాలం అయింది. ముఖ్యంగా కేవలం రెమ్యూనరేషన్ కోసమే కొన్ని కథలు కూడా చేశాడు. అవి డిజాస్టర్ అయ్యాయి. అలాంటి టైమ్ లో అతనికి శంబాల మూవీతో వస్తోంది. శంబాల టైటిల్ నుంచి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా కనిపిస్తుంది. బట్ ఆది ఆ కోవలోనే ఆగిపోతాడు కదా .. అని అంతా లైట్ తీసుకున్నారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు సాయి కుమార్.
సాయికుమార్ పరిచయాల అన్నీ వాడేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ లందరినీ పిలిచాడు. అదీ కేవలం శంబాల హిట్ అవడమే ఖాయం అనిపించేలా చేశాడు. అవన్నీ ఎలా ఉన్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన గెస్ట్ లు మాత్రం కేవలం ఆదిని సాయికుమార్ ను పొగడ్తలతో సరిపెట్టారు. కొంచెం భక్తి గురించి మాట్లాడారు. బట్ ఎక్కువగా ఆదితో పాటు సాయి కుమార్ గురించి మోశారు అనిపించేలా చేశారు. అనిల్ రావిపూడి, థమన్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి.. ఇలా ఒక్కొక్కరిని మించి ఒకలా పొగడ్తల వర్షం కురిపించాడు. సింపుల్ గా చేస్తే ఇదేదో ఆది సాయికుమార్ లాంచింగ్ మూవీలా చేశారు. ఇక్కడ దర్శకుడి గురించి ఒకరో ఇద్దరు తప్ప మాట్లాడ్డం మాత్రం ఖచ్చితంగా తప్పు అనే చెప్పాలి. ఇంత దారుణమైన ఫేజ్ లో ఉన్న ఆదికి ఇలాంటి మూవీ కోసం అంత ఎఫర్ట్ పెట్టడం కేవలం దర్శకుడి వల్లే.
ఏదేమైనా ఒక్కోసారి ఇంత హడావిడీగా చేసిన మూవీస్ కూడా పోయాయి. ఒక్కోసారి హిట్ అయ్యాయి. మరి ఈ రెండు సందర్భాల్లో ఆది ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో కానీ.. ఇది అతనికి చివరి అవకాశం అనేది మాత్రం స్పష్టంగా తెలిసిపోతుంది.