Acharya : ఓటీటీలోకి ఆచార్య... ఎప్పటినుంచి అంటే...!
Acharya : కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన చిరంజీవి ఆచార్య మూవీ ఎట్టకేలకి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.;
Acharya : కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన చిరంజీవి ఆచార్య మూవీ ఎట్టకేలకి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించాడు.
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్సుడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే సొంతం చేసుకోగా, థియేటర్లో విడులైన మూడు వారాల అనంతరం ఆచార్య ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది.
మే చివరి వారంలో ఆచార్య ఓటీటీలో సందడి చేయనుందని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మణిశర్మ సంగీతం అందించిన ఆచార్య చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.