Bigg Boss Telugu Season 5: ఆయన కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకో.. : సిరిపై మాధవీలత షాకింగ్ కామెంట్స్
Bigg Boss Telugu Season 5: ఈ సీజన్‌లో ముఖ్యంగా సిరి, షణ్ణూ మీద కెమేరా ఎక్కువగా ఫోకస్ అవుతోంది..;
Bigg Boss Telugu Season 5: బయట ఇద్దరికీ లవర్స్ ఉన్నారు.. వాళ్లతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినా ఎవరి ఇమేజ్‌ను వాళ్లు కాపాడుకుంటూ హాయిగా ఉన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాక ఏమవుతుందో ఏమో.. ఎందుకు అలా మారిపోతారో ఎవరికీ అర్థం కాదు.. ప్రేమలు, పగలు, ద్వేషాలు.. అన్ని రోజులు హౌస్‌లో కలిసి ఉంటే అవన్నీ సహజమేనేమో కానీ అవే హైలెట్ చేస్తుంటాడు బిగ్‌బాస్.. ప్రేక్షకులకు కావలసినంత
ఎంటర్‌టైన్‌మెంట్ అందించాలంటే తప్పదేమో మరి. ఈ సీజన్‌లో ముఖ్యంగా సిరి, షణ్ణూ మీద కెమేరా ఎక్కువగా ఫోకస్ అవుతోంది.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాధవీలత అయితే.. విమర్శించడానికి ఓ టాపిక్ దొరికిందని ఇద్దర్నీ ఏకిపారేసింది..
సిరిది సిగ్గులేని జన్మ.. అంత తిట్టినా వాడితో స్నేహం చేస్తోంది. అలా చేస్తే భార్య కూడా భర్తకి వాతలు పెడుతుంది.. ఓట్ల కోసం.. వచ్చే నోట్ల కోసం ఇంతగా దిగజారుతారా.. అటు తల్లిని, ఇటు పార్ట్‌నర్ (శ్రీహాన్)ను లెక్కచేయని పద్ధతి గల మంచి అమ్మాయి సిరి. బంధాలు, అనుబంధాలకి అర్థం మార్చిన ఘనత మీది. షో అయిపోయి బయటకు వచ్చాక శ్రీహాన్ నిన్ను భరిస్తాడంటే ఆయన దేవుడితో సమానం..
అతడి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకో.. వచ్చే జన్మలో అయినా దేవుడు నీకు మంచి బుద్ధి ఇస్తాడు. షణ్ముఖ్ గురించి రాస్తూ.. పక్కవాళ్లకు నీతులు చెప్పడం కాదు.. సిరిని సెక్యూరిటీ గార్డ్‌లా కాపాడుతున్నాడట. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో షణ్ణూ, సిరి ప్రవర్తన చూసే వారికి ఏవగింపుగా ఉంది. వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారని షో చూస్తున్న ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అని మాధవీలత ఘాటుగా విమర్శించింది.