Actor Naresh: సీనియర్ నటుడి కొత్త కారవాన్.. ఖర్చు విషయంలో తగ్గేదే లే అంటూ..
Actor Naresh: కరోనా సమయంలో వేరేవారితో కారవాన్ షేర్ చేసుకోవడం అంత మంచిది కాదన్నారు నరేశ్.;
Actor Naresh: కారవాన్ అనేది సెలబ్రిటీలకు ఓ స్టార్ సింబల్ లాంటిది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్లు ఈ కారవాన్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. అందులో అన్ని సదుపాయాలకు ఎంతైనా ఖర్చు చేస్తారు. తాజాగా సీనియర్ నటుడు నరేశ్ కూడా అదే చేశారు. తన కొత్త కారవాన్‌ను అందరికీ చూపించారు. దీనికోసం నరేశ్ చాలానే ఖర్చు చేసినట్టు టాక్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పటికే టాలీవుడ్‌లోనే ఖరీదైన కారవాన్ ఉపయోగిస్తున్న హీరోగా నిలిచాడు. తన కారవాన్ ధర ఏకంగా కోట్లలోనే ఉంటుంది. అలాగే చాలామంది ఇతర హీరోలు, హీరోయిన్లు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. అందుకే తాను కూడా ప్రత్యేకంగా ఓ కారవాన్ తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు నరేశ్.
సాధారణంగా క్యారెక్టర్ ఆర్టిస్టులకు ప్రత్యేక కారవాన్ ఉండే అవకాశాలు చాలా తక్కువ. కానీ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులలో నరేశ్ కూడా ఒకరు. చేతినిండా సినిమాలతో ఇంత బిజీగా గడిపేస్తున్న ఆయన.. ఈ కరోనా సమయంలో వేరేవారితో కారవాన్ షేర్ చేసుకోవడం అంత మంచిది కాదని భావించారు. అందుకే తనకు నచ్చిన సదుపాయాలతో కారవాన్‌ను కొనుగోలు చేశారు.
తన జీవితంలో 70 శాతం సమయం కారవాన్‌లోనే గడిచిపోతుందని, పైగా ఇలాంటి కరోనా సమయంలో వేరేవారితో కారవాన్ షేర్ చేసుకోవడం అంత మంచిది కాదన్నారు నరేశ్. అందుకే ఈ కొత్త కారవాన్‌ను కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈ ఏసీ కారవాన్‌లో బెడ్, మేకప్ ప్లేస్, జిమ్, వెయిటింగ్ రూమ్, వాష్‌రూమ్ వంటివి ఉన్నాయి. దీనికోసం ఎంత ఖర్చు అయ్యిందన్న విషయం బయటికి రాకపోయినా.. కారవాన్‌కు ఖర్చు పెట్టే విషయంలో నరేశ్ కాంప్రమైజ్ అవ్వలేదని టాక్.