సీనియర్ నటుడు శివాజీ రాజా ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి రామ రాజు(85) కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన మరణించినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లోని మధురా నగర్ లో ఉంటున్నారయన. ఇంట్లోనే మరణించారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ రాజాతో బాగా క్లోజ్ గా ఉన్నవాళ్లంతా ఆయనకు ధైర్యం చెబుతున్నారు.
ఇక రామరాజు గారికి జూబ్లీ హిల్స్ లోని మహా ప్రస్థానంలో ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు అంత్య క్రియలు నిర్వహిస్తారు. శివాజీ రాజాకు తండ్రిపై చాలా ప్రేమ ఉంది అని చెబుతూ ఉండేవాడు. ఆయన మరణంతో ఓ రకంగా తన ధైర్యాన్ని కోల్పోయారు.