X Videos : ఇండియాలో ఎక్స్ వీడియోస్ ను బ్యాన్ చేసిన ఎక్స్

Update: 2026-03-03 09:00 GMT

ఇండియాలో విపరీతమైన వీడియోస్ పెరిగిపోతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా ఈ తరహా వీడియోస్ ను అప్లోడ్ చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని సైట్స్ లో ఇవి పెడుతున్నారు. ఆ కారణంగా అవి పెరిగిపోతున్నాయి. దీంతో కొన్ని కంటెంట్స్ తో పాటు ప్లాట్ ఫామ్స్ లో ఇండియాలో బ్యాన్ చేశారు. కాకపోతే ఈ తరహా వీడియోస్ ను ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో విపరీతంగా అప్లోడ్ చేస్తున్నారు. ఈ వీడియోస్ ఇండియాలో చూడటం తప్పు అంటూ.. వాటిని బ్యాన్ చేయాలంటూ చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు. బట్ ఎలాన్ మస్క్ దాన్ని పట్టించుకోవడం లేదు. ఫైనల్ గా అతను ఇండియా నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఈ తరహా వీడియోస్ ను బ్యాన్ చేశాడు. దీంతో చాలామంది హ్యాపీగా ఫీలవుతున్నారు.

కొన్ని దేశాల్లో పోర్న్ అనేది చాలా సాధారణమైన విషయం. ఆ వీడియోల్లో నటించే వారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఇండియాలో ఈ తరహా వీడియోస్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను చూపిన కారణంగానే ఎక్స్ ఖాతా ఆ వీడియోస్ ను తొలిగించింది. మరి ఎక్స్ దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తుందా లేక కొన్ని రోజుల తర్వాత మళ్లీ అవి కనిపిస్తాయా అనేది చూడాల్సి ఉంది. దీంతో పాటు కొందరు మాత్రం సోషల్ మీడియాలో బహిరంగంగానే ఈ వీడియోస్ ను బ్యాన్ చేయడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు అయితే ఎక్స్ వీడియోస్ ఎక్స్ ఖాతాలో రావడం లేదు అంటున్నారు. ఇంకొందరైతే ఇంకా వస్తున్నాయి అనీ అంటున్నారు. మొత్తంగా ఈ సందిగ్ధావస్థను ఇలాగే కొనసాగించకుండా పూర్తి స్థాయిలో ఈ తరహా వీడియోస్ పై శాశ్వతంగా బ్యాన్ విధించాలి. 

Tags:    

Similar News