Pallavi Joshi: షూటింగ్‌లో నటికి గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స

Pallavi Joshi: ది కాశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు తమ తదుపరి చిత్రం 'ది వ్యాక్సిన్ వార్'లో బిజీగా ఉన్నారు.;

Update: 2023-01-17 06:14 GMT

Pallavi Joshi: 'ది కాశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు తమ తదుపరి చిత్రం 'ది వ్యాక్సిన్ వార్'లో బిజీగా ఉన్నారు. జాతీయ అవార్డు గ్రహీత, వివేక్ అగ్నిహోత్రి భార్య పల్లవి జోషి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.


ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సెట్‌లో ఉన్న నటి పల్లవి జోషిని వాహనం ఢీ కొనడంతో గాయపడింది. అయినా ఆమె తన షాట్‌ పూర్తి చేసి స్థానిక ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లింది. అక్కడ ఆమె బాగానే ఉన్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.

Tags:    

Similar News