Pragya Jaiswal: ఆయన మనిషి కాదు.. బాలకృష్ణపై ప్రగ్యా జైస్వాల్ సెన్సేషనల్ కామెంట్స్
Pragya Jaiswal: ఆయన డైలాగ్స్‌లో ఎంత పవర్ ఉంటుందో.. ఆయన పనిలో కూడా అంత డెడికేషన్ ఉంటుంది..;
Pragya Jaiswal: కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా.. చెప్పడంలో కన్ఫ్యూజన్ ఉండదు.. కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు.. అలాగే పనిలో బద్దకం ఉండదు మన బాలయ్య బాబుకి.. ఆయన డైలాగ్స్‌లో ఎంత పవర్ ఉంటుందో.. ఆయన పనిలో కూడా అంత డెడికేషన్ ఉంటుంది.. ఆ విషయాన్ని ఫ్యాన్స్‌తో పాటు బాలయ్య తాజా చిత్రం అఖండలో నటిస్తున్న నటీమణి ప్రగ్యా జైస్వాల్ కూడా అదే మాట అంటున్నారు. డిసెంబర్ 2న రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్న తరుణంలో చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలు మీడియాతో పంచుకుంది ప్రగ్యా.
మొట్టమొదటి సారిగా బాలకృష్ణ గారితో నటించే అవకాశం వచ్చింది. అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన వర్క్ డెడికేషన్‌కి ఫిదా అయ్యాను. ఆయన పక్కన నటించాలంటే ముందు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. కానీ ఓ అయిదు నిమిషాలు మాట్లాడేసరికి చాలా కంఫర్ట్ అనిపించింది. ఆయన వస్తుంటే సెట్ అంతా సైలెంట్ అయిపోతుంది. క్రమశిక్షణ, టైమ్ మేనేజ్ మెంట్ గురించి ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను.
దర్శకుడు బోయపాటి గారు ఎంచుకున్న అఖండ లాంటి కధ ఇంత వరకు వినలేదు.. ఇతర భాషల్లోనూ ఇంత పవర్ ఫుల్ పాత్రను చూడలేదు. బాలకృష్ణ గారు ఆ పాత్రలో ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తారు. ఉదయం మూడు గంటలకు లేచి రెడీ అయి ఆరుగంటలకల్లా సెట్‌కు వస్తారు. రోజంతా షూటింగ్ చేస్తారు. సీనియర్ యాక్టర్ అయి ఉండి, టాప్ పొజిషన్‌లో ఉన్న బాలకృష్ణగారు అంత డెడికేషన్‌తో వర్క్ చేయడాన్ని చూసి అసలు మీరు మనిషేనా అని అడిగేశాను..
ఈ చిత్రంలో ప్రగ్యా.. శ్రావణ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంది. జగపతిబాబుకి, తనకి కూడా చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇచ్చారు దర్శకుడు బోయపాటి గారు అని ప్రగ్యా జైస్వాల్ 'అఖండ' సినిమా గురించి చెప్పుకొచ్చింది.