Kriti Shetty : బాలీవుడ్ ఎంట్రీకి కృతిశెట్టి

Update: 2025-12-31 08:00 GMT

తెలుగులో కెరీర్ మొదలుపెట్టింది కృతిశెట్టి. ఫస్ట్ మూవీ ఉప్పెనతో తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత మాత్రం అన్నీ ఫ్లాపులే కనిపించాయి. కాస్త బంగార్రాజు అనే బెటర్. ఈ మధ్య ఏ సినిమా చేసినా పోవడం గ్యారెంటీ అనిపించుకుంది. దీంతో కోలీవుడ్ లో ఎంట్రీ అయింది. బట్ అక్కడ కూడా మైనస్ అయింది. తను చేసిన సినిమాలు ఈ యేడాది ఎప్పుడో పూర్తయినా.. రిలీజ్ మాత్రం ఆగిపోయింది. తమిళ్ లో తను చేసిన వా వాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రం ఆగిపోయాయి. ఈ రెండు సినిమాలతో తన కెరీర్ కొత్త మలుపు తిరుగుతుంది అనుకుంది. బట్ అలాంటిదేం కనిపించడం లేదు. ఈ టైమ్ లో బాలీవుడ్ లో కూడా డెబ్యూ ఇవ్వబోతోంది. బాలీవుడ్ డెబ్యూ అంటే మాగ్జిమం అమ్మడి అందాలారబోతతో మాత్రమే ఎక్కువగా కనిపించడం గ్యారెంటీ అనిపించేలా ఉంది.

హిందీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించబోతోన్న మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇదో యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. పూర్తి స్థాయిలో ఫైట్స్ తో నిండిన మూవీ అవుతోంది. జనవరి 21 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది ఈ మూవీ. రెండు నెలల పాటు ఏకధాటిగా చిత్రీకరణ చేయబోతున్నారు. అది కూడా ముంబైలోనే. ఆ తర్వాత కూడా సినిమా పూర్తయ్యే వరకు చిత్రీకరణ సాగుతుందట. 2026 సెకండ్ హాఫ్ లో సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ తో రెడీగా ఉంది ఈ చిత్రం. మరి కృతిశెట్టి ఈ మూవీతో బాలీవుడ్ లో అయినా పాగా వేస్తుందా లేదా అనేది చూడాలి. 

Tags:    

Similar News