Pranitha Subhash : ప్రణీత వెరీ టాలెంటెడ్... పదో తరగతిలో ఎన్ని మార్కులంటే?
Pranitha Subhash 10th Class : సినిమాల్లోకి రాకముందు సినీ సెలబ్రిటీలు ఎన్నో విషయాల్లో ఆరితేరి ఉంటారు. కొందరు మాడలింగ్ లో రాణిస్తే, మరికొందరు బిజినెస్ లో రాణించి ఉంటారు.;
Pranitha Subhash 10th Class : సినిమాల్లోకి రాకముందు సినీ సెలబ్రిటీలు ఎన్నో విషయాల్లో ఆరితేరి ఉంటారు. కొందరు మాడలింగ్ లో రాణిస్తే, మరికొందరు బిజినెస్ లో రాణించి ఉంటారు. అయితే ప్రణీత హీరోయిన్ కాకముందు మంచి క్లెవర్ స్టూడెంటేనండోయ్. ఈ విషయాన్నీ ఆమె పదో తరగతి మేమో చూస్తే అర్ధమైపోతుంది.
తాజాగా హీరోయిన్ సమంత, ప్రణీత సోషల్ మీడియాలో ఓ ఆట ఆడారు. ఎలాంటి ఫోటో అయినా సరే అడగండి మేము పంపిస్తాము అంటూ అభిమానులకు ఆఫర్ ఇస్తూ ఓ కొత్త ట్రెండ్ కి తెర లేపారు. అయితే సమంత కోపంగా ఉన్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, తింటున్నప్పుడు వింత వింత ఫోటోలను అడిగారు. అందులో భాగంగానే హీరోయిన్ ప్రణీతను టెన్త్ క్లాస్ మేమోను ఓ నెటిజన్ అడగడంతో వెంటనే పంపింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రణీత పదో తరగతిని బెంగుళూరులో చదివారు. అయితే ఆమె మంచి క్లెవర్ స్టూడెంట్ అని కూడా తెలుస్తోంది. ఇంగ్లీష్‌లో 83 శాతం, కన్నడలో 90 శాతం, లెక్కల్లో 90 శాతం, సైన్స్‌లో 90 శాతం, లెక్కల్లో 95 శాతం మార్కలను సాధించింది. అయితే ఇంత బ్రిలియేంట్ స్టూడెంట్ అయినప్పటికీ ఎదో అలా మార్కులు వచ్చాయంటూ కామెంట్ చేసింది ప్రణీత.
అటు ప్రణీత సినిమాల విషయానికి వచ్చేసరికి కన్నడ పరిశ్రమకి చెందిన ప్రణీత.. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అత్తారింటికి దారేది, రభస మొదలగు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం హిందీ, కన్నడ భాషల సినిమాలతో బిజీగా ఉంది.