Tanya Ravichandran : సినిమాటోగ్రాఫర్ తో హీరోయిన్ పెళ్లి

Update: 2025-07-17 05:30 GMT

మామూలుగా హీరోయిన్లు అంటే హీరోలతోనే ఎక్కువగా లవ్ లో పడుతుంటారు. కాదంటే దర్శకులతో. కానీ సినిమాటోగ్రాఫర్స్ తో లవ్ అంటే కాస్త కొత్తగానే ఉంటుంది. అలాగని ఇలాంటివి ఇప్పటి వరకూ జరగలేదని కాదు. బట్ ఈ మధ్య కాలంలో చూడటం ఇదే. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా..? తెలుగులో మరీ స్టార్ ఏం కాదు కానీ తమిళ్ లో మంచి గుర్తింపు ఉన్న బ్యూటీనే. తనే తాన్యా రవిచంద్రన్. సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి ఈ బ్యూటీ బాగా తెలిసే ఉంటుంది. తెలుగులో కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ మూవీ పోయింది. తర్వాత మెగాస్టార్ గాడ్ ఫాదర్ లోనూ కనిపించింది. ఇది పెద్దగా గుర్తింపు తేలేకపోయిన పాత్ర. దీంతో తెలుగులో మరే ఆఫర్ రాలేదు. తమిళ్ నుంచి తెలుగులో డబ్ అయినా నాలుగైదు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు వారిని ఆకట్టుకుంది. తను ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతోంది.

ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న సినిమాటోగ్రాఫర్ గౌతమ్ జార్జ్ ని పెళ్లి చేసుకోబోతోంది తాన్యా రవిచంద్రన్. ఈ ఇద్దరికీ రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే ఈ ఇద్దరూ జంట కాబోతున్నారు. ఓ రకంగా చూస్తే తాన్యా కెరీర్ ఇంకా కొన్నాళ్లు ఉండే అవకాశం ఉంది. అయినా పెళ్లంటే ప్రేమే కారణం అనుకోవచ్చు. మరి పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తుందా లేక ఇంటికే పరిమితం అవుతుందా అనేది చూడాలి.

Tags:    

Similar News