తేజ సజ్జా హీరోగా నటించిన మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. హను మాన్ తర్వాత మరోసారి సూపర్ హీరోగా నటించాడు తేజ. అతనికి విలన్ గా బ్లాక్ స్క్వాడ్ పాత్రలో మంచు మనోజ్ అదరగొట్టాడు. శ్రీయ పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన మిరాయ్ రిలీజ్ కు ముందు వచ్చిన వైబ్ ఉంది సాంగ్ బాగా ఆకట్టుకుంది. సినిమాలో మాత్రం ఆ పాట లేదు. కథనానికి అడ్డుగా ఉంటుందనే కారణంతో పాటను తొలగించారు. ఈ విషయంలో కొందరు డిజప్పాయింట్ అయ్యారు. అయితే స్క్రీన్ ప్లే సాఫీగా ఉన్నప్పుడు ఈ పాట వస్తే ఇబ్బందిగా ఉంటుందనే తొలగించాం అన్నారు మేకర్స్. అయినా పాట ఉంటే బావుండేది అనేది మేజర్ ఆడియన్స్ ఒపీనియన్. దాన్ని పరిగణలోకి తీసుకున్న టీమ్ ఇవాళ్టి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మిరాయ్ లో ఈ పాటను యాడ్ చేసింది. సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయిన మిరాయ్ కి ఈ సారి పాట ప్లస్ అవుతుంది.
నిజానికి ఈ పాట ఉన్నా ఇబ్బందేం లేదు. కాకపోతే ఫ్లో మిస్ అవుతుందని మేకర్స్ భావించారు. మిస్ అయినా మరీ దూరంగా అయితే వెళ్లేలా లేదీ పాట. పైగా మంచి ప్లేస్ మెంట్ కూడా కనిపిస్తుంది. మరి ఆ ప్లేస్ మెంట్ లోనే ఈ పాటను యాడ్ చేశారా లేక ఇంకేదైనా సీన్ క్రియేట్ చేశారా అనేది కొత్తగా చూస్తున్న వారికి.. ఈ పాట కోసమే మళ్లీ చూసేవారికి తెలుస్తుంది.