Major Teaser: 'మేజర్' టీజర్ వచ్చేసింది.. ఒక్కో సీన్ గూస్ బంప్స్..!

26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Update: 2021-04-12 11:20 GMT

అడవి శేషు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మేజర్'.. ఈ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలిజైంది. తెలుగు వెర్షన్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయగా, హిందీ వెర్షన్ ను సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం ముప్పై నాలుగు సెకండ్లు ఉన్న ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాని శశికిరణ్ దర్శకత్వం వహించగా, శోభితా ధూళిపాళ్ళ, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులై 2న సినిమా విడుదల కానుంది. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. 


Full View


Tags:    

Similar News