Suriya : సూర్యతో పొన్నియన్ పోరి రొమాన్స్

Update: 2025-01-17 10:30 GMT

ఓ వైపు వరుసగా సినిమాలు పోతున్నా.. ఏ మాత్రం తగ్గకుండా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తో వస్తూనే ఉన్నాడు తమిళ్ స్టార్ సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో నటించిన రెట్రో మూవీ ఈ యేడాది మే 1న విడుదల కాబోతోంది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీపై సూర్య చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన కంగువా ప్యాన్ ఇండియా డిజాస్టర్ కావడం సూర్యకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రెట్రోతో మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే దీనికంటే ముందే కమిట్ అయిన మూవీ వెట్రి మారన్ దర్శకత్వం చేయబోతోన్న ‘వాడివాసల్’.

వాడివాసల్ ఎప్పుడో పూర్తి కావాలి. కానీ వెట్రి మారన్ విడుదల 2 కోసం చాలా ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. అందుకే ఆ టైమ్ ను కార్తీక్ సుబ్బరాజ్ కు ఇచ్చాడు సూర్య. కార్తీక్ చాలా వేగంగా సినిమాను పూర్తి చేస్తున్నాడు. అనుకున్న టైమ్ కు విడుదలవుతుంది. విడుదల 2 బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అయినా వెట్రి మారన్ క్రేజ్ తగ్గదు. అందుకే సూర్యతో ప్రాజెక్ట్ పైనా అంచనాలున్నాయి. కలైపులి థాను నిర్మించబోతోన్న ఈచిత్రం కోసం భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ను వాడబోతున్నారు. జురాసిక్ పార్క్ కు పనిచేసిన టీమ్ తో లండన్ లో ఆ టెక్నికల్ వర్క్స్ చేయిస్తున్నాం అని చెప్పాడు నిర్మాత.

తమిళనాడులో చాలా పురాతన సంప్రదాయ క్రీడగా చెప్పుకునే జల్లికట్టు నేపథ్యంలో రూపొందబోతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పొన్నియన్ సెల్వన్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మిని తీసుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది. నటిగా ఐశ్వర్య లక్ష్మి ఎప్పుడో ప్రూవ్ చేసుకుంది. గ్లామర్ తో పాటు నటనలోనూ అదరగొట్టగలదు. సూర్యకు ధీటుగా పర్ఫార్మ్ చేయగలదు. వెట్రిమారన్ మూవీ అంటే హీరోయిన్ పాత్రలు బలంగా ఉంటాయి కదా. అందుకు తగ్గట్టుగానే ఐశ్వర్య సెలక్ట్ అయిందంటున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. 

Tags:    

Similar News