OTT : ఓటీటీలోకి పట్టుదల... స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Update: 2025-02-25 07:15 GMT

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, డైరె క్టర్గిజ్ తిరుమనేని కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'విదాముయార్చి'. తెలుగులో 'పట్టుదల' పేరుతో ఈ నెల 6న థియేటర్లలో రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో మార్చి 3న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంద ని.. సోషల్ మీడియా వేదికగా సదరు సంస్థ ప్రకటించింది. త్రిష హీరోయిన్ గా అలరించిన ఈ మూవీలో అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. బ్రేక్ డౌన్ అనే హాలీవుడ్ సినిమా కథ ఆధారంగా దర్శకుడు తిరుమేని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, బీజీఎమ్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అజిత్ మేనియాతో పట్టుదల సినిమాకు రూ.130 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి.

Tags:    

Similar News