బాలయ్య బాబు అభిమానులకు అదిరిపోయే వార్త అందించింది అఖండ 2 మూవీ యూనిట్. గత కొన్ని రోజులుగా సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో తాజాగా దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 25 న దసరా కానుకగా ఈ సినిమా ను గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్...
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను , బాలయ్య బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ కు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది. కాగా ఇప్పటికే బాలకృష్ణ తన డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత వేగవంతమయ్యాయి. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసిన నిర్మాణ సంస్థ..."గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ ద్వయం ఊహలకు మించి బ్లాక్‌బస్టర్ అందించబోతోంది. తాండవం భారీ స్థాయిలో ఉండనుంది. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధం" అని పోస్ట్‌లో పేర్కొంది. దీంతో సినిమా విడుదల పై ఫుల్ క్లారిటీ ఇచ్చింది మూవీ యూనిట్.
కాగా బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ఇది నాలుగవ చిత్రం కాగా..ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ చిత్రం 'బజరంగీ భాయిజాన్'లో మున్నీ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హర్షాలీ మల్హోత్రా ఇందులో 'జనని' అనే కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.