Akhil Akkineni : భార్యకి స్పెషల్ బర్త్ డే విషెస్: క్యూట్ పిక్ షేర్ చేసిన అక్కినేని హీరో..
ప్రముఖ టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని తన ప్రేయసి జైనాబ్‌ను జూన్ 6న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటూనే తమ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా అఖిల్ చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. తన తన భార్య జైనాబ్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు విషెస్ తెలియజేశారు అఖిల్ అక్కినేని. జైనాబ్‌తో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ, “హ్యాపీ బర్త్ డే మై లైఫ్” అని రాసారు అఖిల్. దీనికి లవ్ సింబల్‌ను కూడా జత చేశారు. ఇంకేముంది అక్కినేని అభిమానులు ఈ పోస్ట్ ను చూసి మురిసిపోతున్నారు. పులువురు జైనాబ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.