Avatar 3 : అవతార్ తో పాటు తెలుగు సినిమాలూ వస్తున్నాయ్

Update: 2025-12-16 09:52 GMT

అవతార్ 3 మూవీపై భారీ క్రేజ్ అంటూ పెద్దగా కనిపించడం లేదు. ఈ మూవీపై అంచనాలు కూడా లేవు. ఇంతకు ముందుతో పోలిస్తే అవతార్ 3 పై క్రేజ్ తగ్గింది అంటున్నారు చాలామంది. బట్ ఇదంతా కేవలం తెలుగులో వరకే. మిగతా చోట్ల మాత్రం అంచనాలు కనిపిస్తున్నాయి ఈ మూవీపై. దీంతో తెలుగులో మాత్రం మరో రెండు సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఆ రెండు సినిమాలు గుర్రం పాపిరెడ్డి, సహకుటుంబానాం. ఈ రెండు కూడా చిన్న సినిమాలే. గత వారం విడుదల కావాల్సినవి. బట్ అఖండ 2 వల్ల ఆగిపోయాయి. ఈ వారం మాత్రం విడుదల కాబోతున్నాయి.

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగిబాబు, రాజ్ కసిరెడ్డి వంటి కాస్టింగ్ తో కనిపిస్తోందీ మూవీ. మురళీ మనోహర్ దర్శకుడు. ప్రమోషన్స్ పరంగా మాత్రం భారీగా కనిపిస్తోంది. ఈ మూవీపై అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఆ ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టుగా ఈ మూవీ కూడా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

మరో సినిమాలో కూడా బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ చిత్రం పేరు సహకుటుంబానాం. ఉదయ్ శర్మ డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. రామ్ కిరణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ కూడా కీలకంగానే ఉన్నాడు. సేమ్ ఈ చిత్రం కూడా గత వారం విడుదల కావాల్సి ఉంది. అఖండ 2 వల్ల ఆగిపోయింది. ఇక ఈ మూవీపై అయితే అంచనాలు లేవు. ప్రమోషన్స్ పరంగా కూడా పెద్దగా హడావిడీ కనిపించడం లేదు. ఓ రకంగా ఈ రెండు సినిమాలు కూడా అవతార్ 3 వల్ల ఇబ్బంది పడతాయి అనిపిస్తోంది. అదే సమయంలో అవతార్ 3 వల్ల లాభపడతాయి అని కూడా అనిపిస్తోంది. 

Tags:    

Similar News