ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తోన్న హీరో అక్కినేని అఖిల్. తిరుగులేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ప్రాపర్ స్టోరీ సెలక్షన్ లేకపోవడంతో ఆరంభం నుంచీ ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. కుర్రాడు చూస్తే ఏ సినిమా అయినా వంద శాతం ఎఫర్ట్ పెడతాడు. జెన్యూన్ గా నమ్మే సినిమాలు చేస్తున్నాడు. కానీ ఎక్కడో తేడా కొడుతోంది. బట్ ఈ సారి అలా జరగకూడదు అనేలా మరో ప్రాజెక్ట్ రాబోతోంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ పడాల్సిందే అనేలా ఈప్రాజెక్ట్ ను సీరియస్ గా తీసుకున్నారు.
అఖిల్ ప్రస్తుత చిత్రాన్ని సొంత బ్యానర్ అన్నపూర్ణ, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో మురళి కృష్ణ అబ్బూరు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. భారీ బడ్జెట్ తోనే రూపొందుతోంది. అఖిల్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి ముందు నుంచీ అంతా ఊహిస్తున్నట్టుగానే ‘లెనిన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీంతో పాటు ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణలో ఉందని చెప్పారు.
లేటెస్ట్ గా ఈ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. టైటిల్ లో ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళుతున్నారు. మొత్తం ఇసుక నేల. పెంకులతో కట్టిన పేదవారి ఇల్లు కనిపిస్తున్నాయి. టైటిల్ కు సరిపోయే మేటర్ పోస్టర్ లో కనిపిస్తోంది. కాకపోతే లెనిన్ అంటే రష్యా విప్లవకారుడు. ఆయన జీవితం, పోరాటం ఎన్నో దేశాలకు ఆదర్శం. అలాంటి వ్యక్తి పేరుతో కథ అంటే ఆ తరహా థియరీ కూడా ఉంటుందా లేక టైటిల్ పవర్ ఫుల్ గా ఉందని పెట్టారా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. సో..అఖిల్ ఈ సారి లెనిన్ గా రాబోతున్నాడు అని కన్ఫర్మ్ చేశారు.