AKSHAY KANNA:'ఫైనెస్ట్ యాక్టర్ ఆఫ్ ది డికేడ్'
ఛావాలో ఔరంగజేబ్‌గా పీక్ పెర్ఫార్మెన్స్... ధురందర్ లో డెకాయిట్ రెహ్మాన్ గా... ఈ దశాబ్దపు అత్యున్నత నటుడిగా అక్షయ్ ఖన్నా
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాలు వచ్చాయి. డెబ్యూ మూవీ హిమాలయ పుత్ర ఫ్లాప్ అయినా సుభాష్ ఘాయ్ తాల్ అప్పట్లో పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత హమ్ రాజ్, బోర్డర్, దివాంగీ, హల్చల్ లాంటివి కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాయి. కానీ ఆ తర్వాతే గ్రాఫ్ డౌన్ అయిపోయింది. వరస ఫ్లాపులతో మెల్లగా పోటీలో వెనుకబడ్డాడు. 2008 రేస్ తర్వాత చెప్పుకోదగ్గ బ్రేక్ దక్కలేదు. అడపాదడపా కనిపిస్తున్నా క్రమంగా తెరమరుగైపోయాడు. దృశ్యం 2 ఆయన్ను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చింది.
కానీ కంబ్యాక్ అవ్వడానికి అది సరిపోలేదు. అయితే 2025 అక్షయ్ ఖన్నాకు భలే కలిసి వస్తోంది. చావాలో ఔరంగజేబు పాత్ర గొప్ప ఖ్యాతి తీసుకురాగా తాజాగా దురంధర్ లో పోషించిన రెహమాన్ బలోచ్ క్యారెక్టర్ కి జనాలు విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. పాకిస్థాన్ లో పేరు మోసిన మాఫియా కం గూండా డాన్ గా అతను చూపించిన ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. ప్రీ క్లైమాక్స్ లో చనిపోయే దాకా అక్షయ్ ఖన్నా డామినేషన్ మాములుగా ఉండదు. కొన్ని సన్నివేశాల్లో ఏకంగా హీరో రణ్ వీర్ సింగ్ నే సైడ్ చేసేంత రేంజ్ లో నటన కనబరచడం అతిశయోక్తి కాదు అంత గొప్పగా పేలింది. సోషల్ మీడియా ట్రెండ్స్ గమనిస్తే అక్షయ్ ఖన్నా ఎంతగా మెప్పించాడో అర్థమవుతుంది. ఇన్నేళ్లు ఎక్కడ ఉండిపోయావంటూ ట్వీట్లు పెడుతున్న వైనం చూడొచ్చు. లేటు వయసులో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న ఇతన్ని యానిమల్ తో బౌన్స్ బ్యాక్ అయిన బాబీ డియోల్ తో పోల్చొచ్చు. ఎందుకంటే అతను కూడా ఇంచుమించు అక్షయ్ ఖన్నా టైంలోనే వచ్చాడు. ఇద్దరి కెరీర్ గ్రాఫ్ ఒకేలా అప్ అండ్ డౌన్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న తీరూ అలాగే ఉంది. దురంధర్ 2లో కూడా అక్షయ్ ఖన్నా ఉన్నాడు. రణ్వీర్ సింగ్ ఫ్లాష్ బ్యాక్ లో మరోసారి చూడొచ్చట. ఫ్యాన్స్ దాని కోసమే వెయిట్ చేస్తున్నారు.
సొంత తల్లిని చంపిన గ్యాంగ్‌స్టర్ పాత్రలో
రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. బాలీవుడ్ హీరో కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ని ఈ సినిమా రాబట్టింది. రెండు రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ.60కోట్లు సంపాదించింది. అయితే ఈ సినిమాలో “రెహమాన్ డకైత్” పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పాకిస్థాన్ కరాచీ అండర్ వరల్డ్‌లో అత్యంత క్రూరమైన వ్యక్తి పాత్రలో నటించి, అందరిని మెప్పించారు అక్షయ్ కుమార్. ఈ నేపథ్యంలోనే అసలైన “రెహమాన్ డకైత్” గురించి తెలుసుకునేందుకు అందరు ఆసక్తి చూపిస్తున్నారు.
రెహమాన్ డకైత్ అసలు పేరు సర్దార్ అబ్దుల్ రెహమాన్ బలోచ్. ఇతను 90వ దశకంలో కరాచీలోని లియారీ ప్రాంతానికి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లలో ఒకడు. ఇతన్ని రెహమాన్ బలోచ్ అని కూడా పిలుస్తారు. రెహమాన్ తండ్రి దదల్ బలోచ్, 1964 నుంచే డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాడు. ఫలితంగా రెహమాన్ కూడా చాలా చిన్న వయసులోనే డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే రెహమాన్ ఒక వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడని చెబుతుంటారు. అంతేకాకుండా, ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుడితో సంబంధం ఉందనే అనుమానంతో రెహమాన్ డకైత్ సొంత తల్లిని కూడా చంపాడని ఊహాగానాలు ఉన్నాయి! సినిమాలో అక్షయ్ ఖన్నా చెప్పే.. ‘రెహమాన్ డకైత్ కి ది హుయీ మౌత్ బహుత్ కసైనుమా హోతి హై’ (రెహమాన్ డకైత్ కసాయిలా చంపుతాడు) అనే డైలాగ్ అతని నిజ జీవిత క్రూరత్వాన్ని సూచిస్తుందని చెబుతున్నారు. రెహమాన్ డకైత్ లియారీలో తన పాలన సాగించినప్పుడు అతని అరాచకం స్పష్టంగా కనిపించేది. రెహమాన్ 'పీపుల్స్ అమన్ కమిటీ'లో సభ్యుడుగా ఉంటూ, తన రాజకీయ పార్టీకి సమాంతరంగా అక్రమ రవాణా (స్మగ్లింగ్) కార్యకలాపాలు నిర్వహించేవాడు.