Akshay Kumar: అలా చేయడం తప్పే.. అభిమానులకు అక్షయ్ కుమార్ క్షమాపణలు..

Akshay Kumar: గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నటుడు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ప్రకటన చేశాడు.

Update: 2022-04-21 06:30 GMT

Akshay Kumar: బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడిగా అక్షయ్ కుమార్ కి పేరుంది.. ఏ పని చేసినా ఓ సోషల్ కాజ్ కోసం చేస్తారు.. సినిమాల ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలని చూస్తారు. సినిమా ఎంపిక పట్లే ఆచి తూచి వ్యవహరించే అక్షయ్, ప్రజలకు అనారోగ్యం తెచ్చిపెట్టే పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించడం ఏమిటి.. ఆ యాడ్ లో నటించడం ఏమిటి అని సోషల్ మీడియాలో ఆయనపై విరుచుకుపడ్డారు సినీప్రియులతో పాటు సామాన్య వ్యక్తులు కూడా.

దీంతో అక్షయ్ తనను క్షమించమంటూ ఆ యాడ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ యాడ్ లో ఇప్పటికే అజయ్ దేవగన్, షారుఖ్ ఖాన్ నటించి, కంపెనీ ఉత్పత్తులను ప్రోత్సహించే పనిలో పడ్డారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా అదే బాటలో పయనించాలనుకున్నాడు కానీ అభిమానులు అడ్డుకట్ట వేశారు.. అయితే తాను ఓ సోషల్ కాజ్ కోసం తనకు యాడ్ ద్వారా వచ్చే రెమ్యునరేషన్ ఉపయోగించాలనుకున్నట్లు తెలిపాడు.. ఏదేమైనా ప్రస్తుతం ఆ యాడ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

తాను ఒప్పందం కుదుర్చుకున్న పొగాకు కంపెనీకి ఇకపై బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనని అక్షయ్ కుమార్ తెలిపాడు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నటుడు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ప్రకటన చేశాడు.

విమల్ ఎలైచి.. ఇది పొగాకు మరియు పొగాకు యేతర వస్తువులను విక్రయించే బ్రాండ్. అతని నిర్ణయాన్ని అభిమానులు ఆమోదించలేకపోయారు. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన బ్రాండ్ అంబాసిడర్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 

అతను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు, "నన్ను క్షమించండి. నా అభిమానులు మరియు శ్రేయోభిలాషులందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మీ స్పందన నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. నేను పొగాకును ఆమోదించను. విమల్ ఎలైచి కోసం ఇక పని చేయను. నేను మొత్తం ఎండార్స్‌మెంట్ రుసుమును ఒక విలువైన కారణానికి అందించాలని నిర్ణయించుకున్నాను.

ఒప్పందం వ్యవధి వరకు బ్రాండ్ ప్రకటనలను ప్రసారం చేయడం కొనసాగించవచ్చు. ఇకపై నా భవిష్యత్ ఎంపికల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నేను మీ ప్రేమను, అభిమానాన్ని ఎప్పటికీ కోరుకుంటాను అని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు అక్షయ్.. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కి కూడా ఈ యాడ్ లో ఆఫర్ వచ్చింది.. భారీ పారితోషికం ఇస్తామంటూ.. అయినా బన్నీ యాడ్ లో నటించే ప్రసక్తే లేదని నిర్మొహమాటంగా తిరస్కరించాడు.

షారూఖ్ ఖాన్, అజయ్ దేవగన్ ఇటీవల ఆ ప్రకటనలో కనిపించారు. అయితే అక్షయ్ కుమార్ ప్రమాదకరమైన ఉత్పత్తిని ఆమోదించడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం, సిగరెట్‌లు, మరికొన్ని ఇతర విషయాల పట్ల అతని ఇష్టాన్ని గురించి అతడు మాట్లాడిన పాత వీడియోలను కూడా పోస్ట్ చేసి ఆ మాటలకు అర్థమేంటన్నట్లు ప్రశ్నించారు.. ఇప్పుడు ఇలాంటి ప్రకటనల్లో నటించడం ఏంటని గుర్తు చేసారు. అందుకే సెలబ్రెటీలు ఏది చేసినా అభిమానులను దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది. 

Full View

Tags:    

Similar News