Shri Chidambaram Garu movie review : శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ

Update: 2026-02-06 10:25 GMT

రివ్యూ : శ్రీ చిదంబరం గారు

తారాగణం : వంశీ తుమ్మల, సంధ్య వసశిష్ట, గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత,తులసి, అరుణ్ కుమార్ తదితరులు

ఎడిటర్ : అన్వర్ అలీ

సంగీతం : చందు రవి

సినిమాటోగ్రఫీ : అక్షయ్ రామ్ పొడిశెట్టి

నిర్మాతలు : చింత వినీషారెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి

దర్శకత్వం : వినయ్ రత్నం

ఈ మధ్య కొత్తవాళ్లు తీస్తున్న మూవీస్ విషయంలో ఉంటోంది. దానికి తోడు కొంతమంది తోడైతే ఆ మూవీస్ ఆడియన్స్ వరకు వెళుతున్నాయి. ఆకట్టుకునే అవకాశం ఉంటే గ్యారెంటీగా హిట్ కొట్టేస్తున్నాయి. అలాంటి రూట్ లోనే రూపొందిన సినిమా శ్రీ చిదంబరం గారు మూవీ. అంతా కొత్తవాళ్లతో రూపొందిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్ అందరి అటెన్షన్ కొట్టేసింది. కొంతమంది పెద్దవాళ్ల సపోర్ట్ కూడా తోడైంది. కట్ చేస్తే ఇవాళ విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :

సాల్మన్ (వంశీ తుమ్మల) కు మెల్లకన్ను ఉంటుంది. ఆ కారణంగా అతన్ని అందరూ చిదంబరం అంటుంటారు. ఇది అతనికీ అలవాటైపోతుంది. చిన్నప్పటి కొన్ని ఘటనల వల్ల ఆ కారణంగా అతనిలో విపరీతమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. అప్పటి నుంచి కళ్లజోడు పెట్టుకుంటాడు. నిద్ర పోయే టైమ్ లో తప్ప ఆ నల్ల కళ్ల జోడు తీయడు. ఇటు లీల(సంధ్య వశిష్ట) చదువు ఆపేసి ఆ ఊళ్లోనే ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. లీలకు సాల్మన్ అంటే ఇష్టం. సాల్మన్ కూడా తనను ఇష్టపడతాడు. ఓ సారి అతని ప్రేమ గురించి చెబుతాడు కూడా. అయితే లీల ముందు అతను అతన్ని ప్రేమించుకోవడం అని చెబుతుంది. ఇది అపార్థం చేసుకుంటాడు సాల్మన్. తన మెల్ల కన్ను బాగు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. మరి ఆ ప్రయత్నంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ..? నిజంగా ఆ మెల్లకన్ను బాగు చేసుకుంటాడా అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

శ్రీ చిదంబరం గారు.. కథగా సింపుల్ గానే ఉంది. ఓ మెల్లకన్ను ఉన్న కుర్రాడు. అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల వచ్చే ఇబ్బందులు, సమస్యలు ఎలా ఉంటాయి అనేది. కానీ కథనంగా మాత్రం వీళ్లు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లిమిటెడ్ క్యారెక్టర్స్, లిమిటెడ్ లొకేషన్ లోనే సినిమా అంతా కానిచ్చేశారు. హీరో తాపీ పని చేసేవాడుగా చూపించడం, హీరోయిన్ కూలీ పనికి వెళ్లే అమ్మాయిగా చూపించడం.. ఆ హీరో తండ్రి నేపథ్యం చిన్నదే అయినా ప్రభావవంతంగా ఉండటం.. దానికి చివర్లో ఓ చిన్న లింక్ పెట్టడం కూడా అనవసం అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో మాగ్జిమం సాఫీగానే ఉంటుంది. కాకపోతే చాలా నెమ్మదిగా సాగుతుంది కథనం. ఈ విషయంలో మళయాల మూవీస్ ను ఫాలో అయినట్టుగా కనిపిస్తుంది. ఈ స్లో నెరేషన్ మరీ పెద్దది కంప్లైంట్ కాదు. బట్ కొన్ని సన్నివేశాలు మాత్రం మరీ సాగదీతగా ఉండటం మైనస్ అవుతుంది. ఒకే బాత్రూమ్ కట్టడంతోనే సినిమా అంతా కనిపిస్తుంది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు సహనానికి పరీక్ష పెడుతుంటాయి. అవన్నీ ఊహించే సన్నివేశాలు కావడం వల్ల అదో మైనస్ గా ఉంటుంది. మళ్లీ ప్రీ క్లైమాక్స్ లో హీరో రాజమండ్రిలోని ఓ ఫ్రెండ్ ఇంట్లో ఉండటం తర్వాత అతను కళ్ల జోడు వదిలించుకోవడం ఇవన్నీ రొటీన్ గానే ఉంటాయి. బట్ సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టదు. స్లోగా సాగేలా ఉన్నా.. అద్భుతమై లొకేషన్స్ వల్ల బానే ఉన్నట్టుగా ఉంటాయి చాలా సీన్స్. ఒక రకంగా చెబితే ఇదో ఓటిటి మూవీలాగా మాత్రమే అనిపించే సందర్భాలు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా మాత్రం ఓ మంచి ప్రయత్నంలా కనిపిస్తుంది. మరి ఈ మంచి ప్రయత్నం కమర్షియల్ గా ఏ మేరకు మెప్పిస్తుందో అనేది చూడాలి.

నటన పరంగా వంశీ తుమ్మల ఆ పాత్రలో ఒదిగిపోయాడు. చిదంబరం పాత్రలో బాగా నటించాడు. లీల పాత్రలో సంధ్య వశిష్టమైన అద్భుతంగా నటించింది. తన ఎక్స్ ప్రెషన్స్ ఎక్స్ ట్రార్డినరీగా ఉన్నాయి. ప్రతి చిన్న సీన్ నూ గొప్పగా పలికించింది. తన పాత్రను చాలా బాగా ఓన్ చేసుకుంది. ఇతర పాత్రల్లో హీరో తల్లిగా రూపాలక్ష్మికి మంచి పాత్ర పడింది. బాగా నటించింది. అలాగే హీరోయిన్ తల్లిగా తులసి కూడా ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో వాళ్లంతా ఓకే అనిపించారు.

టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. అద్భుతమైన లొకేషన్స్ ను క్యాప్చర్ చేశారు. మ్యూజిక్ పరంగా కీరవాణి పాడిన పాట మీనింగ్ ఫుల్ గా మెలోడియస్ గా ఉంది. ఇతర పాటలూ బావున్నాయి. నేపథ్య సంగీతం చాలా బావుంది. ఎడిటింగ్ పరంగా ఓ 20 నిమిషాలైనా ట్రిమ్ చేయొచ్చు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా వినయ్ రత్నం చాలా మంచి ప్రయత్నం చేశాడు. తనలో ఓ మంచి స్టోరీ టెల్లర్ గానూ కనిపిస్తాడు. ఫ్యూచర్ లో మంచి ప్రాజెక్ట్స్ చేయగల సమర్థత కూడా ఉన్నట్టుగా ఉంది అతనిలో.

ఫైనల్ గా : చిదంబరం గారూ.. గొప్ప ప్రయత్నం

రేటింగ్ : 2.75/5

బాబురావు. కామళ్ల

Tags:    

Similar News