Akshay Kumar : కన్నీరుపెట్టుకున్న అక్షయ్ కుమార్.. ఎందుకంటే..
Akshay Kumar : బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ కన్నీరు పెట్టుకున్నారు.
Akshay Kumar : బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ కన్నీరు పెట్టుకున్నారు. టీవీలో ప్రసారమ్యే సూపర్ స్టార్ సింగర్ 2 ప్రోగ్రాంలో ఆయన ఏడ్చినట్లు ఇటీవళ ఓ ప్రోమో విడుదలైంది. రాఖీపండగ సందర్భంగా ఆ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నారు. 'రక్షాబంధన్' సినిమాలో అక్షకుమర్ కీలక రోల్ ప్లేచేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ భాగంగానే ఆయన 'సూపర్ స్టార్ సింగర్ 2' రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ షోలో అక్షయ్‌కు తెలియకుండా తన సోదరి అల్కా భాటియా ఓ ఆడియో మెసేజ్‌ను పంపింది. అందులో.. ఈ మధ్య ఎవరితోనే రాఖీ పండగ గురించి మాట్లాడుతుంటే అన్నయ్య అక్షయ్ కుమార్ గుర్తొచ్చాడని ఈ సందర్భంగా అల్కా భాటియా చెప్పింది. తనను అనుక్షణం సోదరుడిగానే కాకుండా తండ్రిగా, స్నేహితుడిగా సంరక్షిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది.
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. "మా చిన్నప్పుడు మేము చాలా ఇరుకు గదుల్లో ఉండేవాళ్లం.. మా చెల్లిలు దేవతలా రావడంతో మా కష్టాలన్నీ తీరుపోయాయని భావోద్వేగానికి గురయ్యారు అక్షయ్ కుమార్.