National Film Awards : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో తారల ఫోజులు

పలువురు స్టార్ సెలబ్రెటీలకు అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Update: 2023-10-18 07:56 GMT

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం అక్టోబర్ 17న విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో జరిగింది, విజేతలకు ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. ఈ వేడుకలో అలియా భట్, కృతి సనన్ ఉత్తమ నటి అవార్డులను గెలుచుకోగా, అల్లు అర్జున్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. నటుడు ఆర్ మాధవన్ దర్శకత్వం వహించిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' ఈ కార్యక్రమంలో అత్యున్నత గౌరవాన్ని పొందింది. ఈ వేడుకలో ఎస్ఎస్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' ఆరు అవార్డులను కైవసం చేసుకుంది.

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు. విజేతలు ప్రెసిడెంట్ ముర్ము నుండి అవార్డులు అందుకోవడమే కాకుండా ఆమెతో ఇంటరాక్ట్ అయ్యారు, అనంతరం ఆమెతో ఫోటోలు దిగారు.


దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో విజేతలందరి గ్రూప్ ఫొటో ఇక్కడ ఉంది. ఆలియా భర్త, నటుడు రణబీర్ కపూర్ కూడా ఈ చిత్రంలో కెమెరాలకు పోజులివ్వడం చూడవచ్చు.

వేడుక నుండి మరికొన్ని చిత్రాలు..




జాతీయ చలనచిత్ర అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు. వీటిని దేశవ్యాప్తంగా ఉత్తమ చిత్రనిర్మాణ ప్రతిభను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రకారం, జాతీయ చలనచిత్ర అవార్డులు "సౌందర్యం, సాంకేతిక నైపుణ్యం, సామాజిక ఔచిత్యం కలిగిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి".

Tags:    

Similar News