హిట్ మెషీన్ అయిపోయాడు అనిల్ రావిపూడి. ఆ మెషీన్ లో ఎక్కిన వెంకటేష్ కూడా అదే స్థాయిలో దూసుకుపోతున్నాడు. వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం.. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారులోనూ ఓ కేమియో చేశాడు వెంకీ. అంటే నాలుగో సినిమా. ఇప్పుడు 5వదిగా మరో సినిమాగా రూపొందబోతోంది. ఈ మూవీ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. వెంకటేష్ తో పాటు మళయాల స్టార్ ఫహాద్ ఫాజిల్ ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. ఇందులో అతను తోడళ్లుడు పాత్రలో కనిపించబోతున్నాడట. మరి ఈ మూవీలో హీరోయిన్లు ఎవరు అంటే మాత్రం ఇంట్రెస్టింగ్ పేర్లు వినిపిస్తున్నాయి.
అనిల్ రావిపూడి, వెంకటేష్, ఫహాద్ తో పాటుగా నటించే హీరోయిన్లుగా కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. కీర్తితో పాటు పూజా హెగ్డే పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈ ఇద్దరిలో ఒకరు మాత్రం వెంకటేష్ కు జోడీగా నటించబోతారు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఫహాద్ ఫాజిల్ సరసనగా అషికా రంగనాథ్ ను కూడా పరిశీలిస్తున్నారట. అయితే ఆల్మోస్ట్ ఫహాద్ కు జోడీగా అషికా పేరు కన్ఫార్మ్ అయిందని టాక్. మొత్తంగా ఈ ముగ్గురు హీరోయిన్లు వెంకీ మూవీలో నటించబోతున్నారు. కాకపోతే కీర్తి సురేష్ లేదా పూజా హెగ్డేలలో ఒకరిని ఎంచుకోబోతున్నారు. మరి వీరిలో ఆ లక్కీ ఛాన్స్ ఎవరు కొట్టేస్తారు అనేది చూడాలి. అన్నట్టుగా ఈ మూవీని 2027 సంక్రాంతి బరిలో విడుదల చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. అందులో ఏ మార్పూ ఉండదు.