Mirai Movie : అందరి కళ్లూ మిరాయ్ పైనే.. ఎందుకంటే..?

Update: 2025-09-11 08:00 GMT

మిరాయ్.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ద సౌత్ గా ఉన్న మూవీ. హను మాన్ తర్వాత తేజ సజ్జా హీరోగా నటించిన మూవీ కావడం, ఇదీ సూపర్ హీరో మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి. తేజ దేశం మొత్తం తిరిగి విపరీతమైన ప్రమోషన్స్ చేశాడు. తెలుగు కంటే ఇతర భాషల్లోనే ఎక్కువ ఫోకస్ చేశాడు. అది కూడా సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. పైగా వెళ్లిన చోటల్లా మనోడు అక్కడి మీడియాతో పాటు ఆడియన్స్ మనసులను దోచుకునే ప్రయత్నం చేశాడు. హంబుల్ గా కనిపించాడు. ఇది ఎక్కువమందికి నచ్చింది.

ఇక కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన మిరాయ్ కి భారీ ఓపెనింగ్స్ వస్తాయి అని ఇండస్ట్రీ అంతా ఈగర్ గా ఎదురుచూస్తోంది. కొన్ని నెలలుగా టాలీవుడ్ లో సరైన బ్లాక్ బస్టర్ లేక కాస్త స్తబ్ధుగా ఉంది. ఈ స్తబ్ధతను మిరాయ్ బద్ధలు కొడుతుందని అనుకుంటున్నారు. అందుకే ఇండస్ట్రీలో అందరి చూపూ ఇప్పుడు మిరాయ్ పైనే ఉంది. పెద్దగా పోటీ కూడా లేదు. ఇది కూడా మిరాయ్ కి కలసొచ్చే అంశం. దేశవ్యాప్తంగానూ ఓ మంచి సినిమా కోసం చూస్తోంది. ఆ ఎదురు చూపులకు మిరాయ్ సమాధానం చెబితే హను మాన్ ను మించిన విజయాన్ని అందుకుంటాడు తేజ సజ్జా. తేజ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా, మంచు మనోజ్ విలన్ గా నటించారు. శ్రీయ, జగపతిబాబు, జయరాం ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించాడు. 

Tags:    

Similar News