Allari Naresh : వెరైటీగా బచ్చలమల్లి ప్రమోషన్స్

Update: 2024-12-07 13:45 GMT

అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటించిన సినిమా బచ్చల మల్లి. తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించానని దర్శకుడు సుబ్బు మంగాదేవి చెబుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన పాటలు, టీజర్ బాగా ఆకట్టుకున్నాయి. నరేష్ మరోసారి రియలిస్టిక్ గా ఉన్న పాత్ర చేస్తున్నట్టున్నాడు. అందుకోసం మంచి మేకోవర్ కూడా కనిపిస్తోంది. ఒక మూర్ఖుడు కథలా కనిపిస్తోంది. ఇలాంటి ప్రయోగాలు చేసిన ప్రతిసారీ నరేష్ మాగ్జిమం సక్సెస్ అయ్యాడు. అదే ఈ సారి కూడా రిపీట్ అవుతుందనుకుంటున్నారు.

ఈ డిసెంబర్ 20న విడుదల కాబోతోందీ మూవీ. ఇందుకోసం ప్రమోషన్స్ ను కొత్తగా ప్లాన్ చేసింది మూవీ టీమ్. ఇప్పటి వరకూ పాటలు, టీజర్, ట్రైలర్ విడుదల చేయాలంటే ఏదో ఒక ఈవెంట్ చేయడం.. లేదా కాలేజ్ లకు వెళ్లి వారి సమక్షంలో విడుదల చేయడం లాంటివి చూశాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అన్నట్టుగా వీళ్లు.. క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. అందులో ఒక టీమ్ బచ్చలమల్లిది, రెండో టీమ్ తుని వాళ్లది. అంటే ‘బచ్చలమల్లి టీమ్ వర్సెస్ తుని లోకల్’ అన్నమాట. ఈ మ్యాచ్ ను ఈ నెల 9న తునిలోని క్రీడా వికాసకేంద్రంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించబోతున్నారు.

ఈ రెండు టీముల్లో ఎవరు గెలిస్తే వారు అక్కడ బచ్చలమల్లి సినిమా నుంచి మూడో పాటను లాంచ్ చేస్తారన్నమాట. అంతే కాదు.. గెలిచిన వారికి 50వేల రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా ఉంది. ఐడియా బావుంది. కాకపోతే సెలబ్రిటీస్ వెళితే కంట్రోలింగ్ కష్టంగా ఉంటుంది. ఇలాంటి ఈవెంట్స్ అంటే ఖచ్చితంగా హీరో, హీరోయిన్ కూడా ఉంటారు. వారికోసమైన ప్రేక్షకులు విపరీతంగా వస్తారు. సో.. ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ముందుగానే పోలీస్ వారితో కో ఆర్డినేట్ చేసుకుంటూ హ్యాపీగా సాంగ్ లాంచ్ చేసుకుంటే బావుంటుంది. 

 

Tags:    

Similar News