Unstoppable With Chiru : చిరంజీవితో అన్‌స్టాపబుల్ .. రాజశేఖర్, సుమన్ లతో ఎపిసోడ్స్?
Unstoppable With Chiru : బాలయ్య హోస్ట్‌గా చేసిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో ఎంత క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే.;
Unstoppable With Chiru : బాలయ్య హోస్ట్‌గా చేసిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో ఎంత క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే.. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ సాధించి సంచలనం సృష్టిచింది ఈ షో.. బాలయ్య తనదైన మ్యానరిజంతో షోకి మంచి క్రేజ్ తీసుకొచ్చారు. మహేష్ బాబు ఎపిసోడ్‌తో ఈ షో సక్సెస్ఫుల్‌గా ముగిసింది.
దీంతో అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌కు కూడా సన్నాహాలు చేస్తున్నారట అల్లు అరవింద్.. సెకండ్ సీజన్ ఇంకో లెవల్‌లో ఉంటుందట.. అయితే ఈ సీజన్‌ని మెగాస్టార్‌తో హోస్ట్ చేయించాలని అల్లు అరవింద్ భావిస్తున్నారట... నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, సుమన్ లాంటి హీరోలతో ఈ సీజన్‌ని ఉండబోతుందని ప్రచారం నడుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుంది.
వాస్తవానికి అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోలో మెగాస్టార్ కోసం ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారట అరవింద్.. కానీ ఆ సమయంలో బాలయ్య భుజానికి శస్త్రచికిత్స కావడం, అటు చిరంజీవి ఒకేసారి మూడు సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ ఎపిసోడ్ మిస్ అయిందట. ఒకవేళ చిరంజీవితో బాలయ్య అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కనుక చేసుంటే టాక్ షో ఇంకో లెవెల్లో ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.