Allu Arjun : రెండు భాగాలుగా అల్లు అర్జున్ మూవీ

Update: 2025-12-18 08:07 GMT

సీక్వెల్స్ అనే ట్రెండ్ ఇప్పుడు మారిపోయింది. రెండో భాగం అని ఎవరూ అనడం లేదు. ఒకవేళ అంటున్నా.. వారు సక్సెస్ రేట్ కూడా చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఒకే సినిమాకు రెండు భాగాలుగా చేయడం మాత్రం ఇప్పుడు కామన్. బాహుబలి నుంచి మొదలైన ఈ ట్రెండ్. ఈ ట్రెండ్ లో వచ్చిన పుష్ప, పుష్ప2 తో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు అతని నెక్ట్స్ మూవీ కూడా ఇదే విషయంలో రిపీట్ కాబోతోంది. అట్లీ డైరెక్ట్ చేయబోతున్న మూవీ విషయంలోనూ రెండు భాగాలుగా రూపొందించబోతున్నాడు.

అట్లీ డైరెక్షన్ లో రూపొందించే సినిమా మరో స్థాయిలో ఉండబోతోంది అని టాక్. అతని డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీ అనడంతోనే మాగ్జిమం హిట్ అనే టాక్ వచ్చేసింది. దీపికా పదుకోణ్ ఫీమేల్ లీడ్ గా కనిపించబోతోందీ మూవీలో. ముందుగా ఇది ఒక పార్ట్ లోనే పూర్తి చేయాలనుకున్నారు. కానీ తాజాగా ఇది రెండో భాగానికి కూడా ఆస్కారం ఉన్న చిత్రమే అని ఫిక్స్ అయ్యారట. ఆ మేరకు కథలో మార్పులు చేస్తున్నారు. రెండో భాగానికి సరిపోయేలా కథ మార్చబోతున్నారు. ఆ మేరకు అవసరమైన అన్ని విధాలుగా ప్లాన్ చేయబోతున్నారు.

మొత్తంగా పుష్ప లాగా అల్లు అర్జున్ అట్లీ కూడా రెండు భాగాలుగా రూపొందించబోతున్నాడీ మూవీని. కథ, కథనాల విషయంలో అల్లు అర్జున్ కూడా చాలా మార్పులు చేర్పులు సలహాలు పాటించబోతున్నాడు. మరి ఈ రెండు భాగాల్లో.. ఫస్ట్ పార్ట్ ను 2026 దసరాకు విడుదలైనా.. రెండో భాగం వెంటనే స్టార్ట్ చేస్తారా లేక ఆగిపోయి మరో ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఆ తర్వాత ఈ పార్ట్ కు వస్తారా అనేది చూడాలి. 

Tags:    

Similar News