Allu Arjun : కొత్త చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్

Update: 2024-12-11 09:57 GMT

అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. తెలుగు సినిమా హిస్టరీలో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న ఫస్ట్ యాక్టర్ గా సృష్టించిన రికార్డ్ కంటే పెద్దదే ఇది. టాలీవుడ్ నుంచి ఫాస్టెస్ట్ 1000 క్రోర్ వసూళ్లు సాధించిన హీరోగా నిలిచాడు. రిలీజ్ కు ముందు ఎలా ఉన్నా.. తెలుగులో థియేటర్స్ వెలవెలబోతున్నాయనే వార్తలు వస్తున్నా.. నార్త్ నుంచి ఈ మూవీకి వసూళ్ల వర్షం కురుస్తోంది. వీకెండ్ లోనే కాదు.. వీక్ డేస్ లోనూ కలెక్షన్ల సునామీ కనిపిస్తోంది. అదే ఈ చిత్రాన్ని అత్యంత వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన సినిమాగా నిలిపింది. దీంతో సుకుమార్ క్రియేట్ చేసిన ఈ మ్యాజిక్ ఓ మెమరబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అల్లు అర్జున్ కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళుతోంది. ఈ స్టాండర్డ్స్ ను రీ క్రియేట్ చేసే టాలీవుడ్ హీరో ఎవరా అనే కొత్త సవాల్ కు తెరలేపిందీ వేగం. అలాగే రాజమౌళి లేకుండా ప్యాన్ ఇండియా హీరోగా మారిన హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు.

నిజానికి పుష్ప 2కు తెలుగులో విపరీతంగా టికెట్ రేట్స్ పెంచిన కారణంగానే ఎక్కువ డల్ అయింది. లేదంటే 1000 కోట్ల మార్క్ ను ఇంకా వేగంగా చేరుకునేదే. పెరిగిన టికెట్ ధరలు సినిమాకు పెద్ద మైనస్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. కేవలం ఫ్యాన్స్ మాత్రమే జేబులు గుల్ల చేసుకున్నారు తప్ప మిగతా ప్రేక్షకులు ఓటిటి వరకూ వేచి చూద్దాం అని ఫిక్స్ అయిపోయారు. అందుకే టికెట్ ధరలు తగ్గిన తర్వాత కూడా థియేటర్స్ లో కళ కనిపించడంలేదు. అయినా ఇతర రాష్ట్రాల రెవిన్యూతోనే 1000 కోట్ల మార్క్ ను అందుకోవడం అంత సులువైన విషయం కాదు. మరి పుష్పరాజ్ ను ఢీ కొట్టి అతన్ని దాటి నిలిచే మేటి హీరో ఎవరో చూడాలి. 

Tags:    

Similar News