శివకార్తికేయన్.. కామన్ మేన్ గా కోలీవుడ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా ఒక స్టార్ హీరోగా మారిపోయాడు. అతను ఎంచుకున్న కథలే అతన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఇంకా చెబితే కోలీవుడ్ బిగ్ స్టార్ అయిన విజయ్ తర్వాత ఆ స్థానంలోకి వచ్చేది శివకార్తికేయన్ అంటారు. ఆ రేంజ్ లో ఉంటాడా లేదా అనేది అప్పుడే చెప్పలేం కానీ తాజాగా మాత్రం అతనుతో బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అయ్యాడు. ఈ 9న విజయ్ నటించిన జన నాయగన్, 10న పరాశక్తి విడుదల కావాల్సి ఉంది. బట్ జన నాయగన్ వాయిదా పడింది. అది బిగ్గెస్ట్ ఎసెట్ కాబోతోంది పరాశక్తికి అంటే అతిశయోక్తి కాదు.
పరాశక్తికి ఓపెనింగ్స్ విషయంలో జన నాయగన్ కు కొంత మైనస్ అవుతుంది. అంటే ఓపెనింగ్స్ ఉన్నా.. అది మరీ గొప్ప స్థాయిలో ఉండవు అనేది తెలిసిందే. బట్ ఇప్పుడు జన నాయగన్ వాయిదా పడటం మాత్రం చాలా పెద్ద ప్లస్ అవుతుంది. పరాశక్తికి భారీ ఓపెనింగ్స్ దక్కబోతున్నాయి అనిపించేలా ఉంది. సంక్రాంతి బరిలో తమిళ్ లో ఆ రెండు సినిమాలు మాత్రమే పెద్దగా కనిపించాయి. బట్ ఇప్పుడు ఒక్కటీ మిగిలిపోవడం మామూలు లక్ కాదు శివకార్తికేయన్ మూవీకి. సుధా కొంగర దర్శకత్వం చేసిన సినిమా ఇది. రవి మోహన్, శ్రీ లీల, అధర్వ మురళీ వంటి కాస్టింగ్ కనిపిస్తోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతోంది. ఆ మేరకు అద్భుతమైన సెట్స్, ఆర్ట్ వర్క్ కనిపించాయి. మొత్తంగా జన నాయగన్ పోస్ట్ పోన్ కావడం పరాశక్తికి మాత్రం చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవబోతోంది అనడంలో అతిశయోక్తేం లేదు. చూస్తుంటే అతను విజయ్ కి దగ్గరగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి శివకార్తికేయన్ కి.