ఐకన్ స్టార్ అల్లు అర్జున్ దూకుడు మామూలుగా లేదుగా. అన్ని సినిమాలూ ప్యాన్ ఇండియా స్థాయిలోనే ఉండబోతున్నాయి. ముఖ్యంగా అట్లీతో మూవీ విషయంలో ఇప్పటికే హాట్ టాపిక్ గా ఉంది. ఈ మూవీ చిత్రీకరణ కూడా చాలా వేగంగా సాగుతోంది. సూపర్ మేన్ తరహాలో వీళ్ల సినిమా ఉండబోతోంది అని తెలుస్తోంది. తర్వాత లోకేష్ కనకరాజ్ తో మూవీ కమిట్ అయ్యాడు అల్లు అర్జున్. లోకేష్ కూడా ఇప్పటి వరకు ప్యాన్ ఇండియా దర్శకుడు అనిపించుకోలేదు. బట్ ఈ మూవీతో మాత్రం అది సాధ్యం అవుతుంది అని బలంగా నమ్ముతున్నాడు. మరి ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు తీసుకుంటారు అనే ప్రశ్నకు సమాధానం తెలియబోతోంది.
అల్లు అర్జున్ 23వ సినిమాగా రాబోతోంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ కూడా ఆల్రెడీ లోకేష్ స్టార్ట్ చేస్తున్నాడట. ఇందులో భాగంగా ముందుగా హీరోయిన్ ను ఫైనల్ చేయాలనుకున్నాడు.. చేశాడు. ఈ మూవీలో హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ను ఫైనల్ చేశారుట. శ్రద్ధ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతోంది. తనే మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న మూవీస్ అన్నీ కూడా కమర్షియల్ గా పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. పైగా తను ఆల్రెడీ ప్రభాస్ తో సాహో మూవీలో కూడా నటించింది. అందుకే సౌత్ మూవీస్ అంటే తనకూ ఇష్టం కదా. ఆ కారణంగానే అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందబోతోన్న మూవీలో హీరోయిన్ గా ఓకే చేసింది. మరి ఈ కాంబినేషన్ ఎంత సంచలనం అవుతుందో చూడాలి.