Allu Arjun : అల్లు అర్జున్ న్యూలుక్ అందుకోసమే..
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూలుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది;
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూలుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ బాలీవుడ్‌ను కూడా దాటేసింది. స్టైలిష్ స్టార్ నిన్న తన అఫిషియల్ ఇన్స్‌టాగ్రామ్‌లో తన కొత్త లుక్‌ని పోస్ట్ చేశారు. నెరసిన గడ్డం, నోట్లో చుట్టా, బ్లాక్ కూలింగ్ గ్లాసెస్‌లో మాస్‌లుక్‌లో కనిపించాడు బన్నీ. ఇప్పుడు ఈ ఫోటోను షేర్ల మీద షేర్లు చేస్తున్నారు అభిమానులు.
అయితే అల్లు అర్జున్ రిలీజ్ చేసిన ఈ కొత్త లుక్ సినిమాకు సంబంధించినది కాదని యాడ్ ప్రమోషన్ కోసం ఇలా గెటప్ అయ్యారని తెలుస్తోంది. మోస్ట్ అవైటింగ్ సినిమా పుష్ప 2 షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. సెప్టెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి.. జనవరిలో కంప్లీట్ చేసి, 2023 వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు దర్శకుడు సుకుమార్.