Pushpa Item Song : 'మీ మగబుద్ధే వంకరబుద్ధి..' లిరిక్స్ పై బన్నీ ఏమన్నాడంటే?
Pushpa Item Song : 'ఊ అంటావా మామా.. ఊహూ అంటావా' అనే పాటతో ఒక్కసారిగా పుష్ప మూవీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.;
Pushpa Item Song : 'ఊ అంటావా మామా.. ఊహూ అంటావా' అనే పాటతో ఒక్కసారిగా పుష్ప మూవీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.. దానికికారణం వన్ అండ్ ఓన్లీ సమంత.. ఆ పాటకి క్రేజ్ ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే.. మత్తు వాయిస్‌తో సాగే ఈ పాట శ్రోతల చేత వన్స్ మోర్ అనిపిస్తోంది. చంద్రబోస్ ఈ పాటకి లిరిక్స్ అందించగా.. ఇంద్రావతి చౌహాన్ ఈ పాటను ఆలపించారు. దేవి మ్యూజిక్ అందించాడు. ఇప్పుడీ ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
ఈ పాటకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో వివాదాలు కూడా అంతేస్థాయిలో చూట్టుముట్టుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘంతో పాటుగా తమిళనాడు పురుషుల సంఘం ఈ పాట పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే తాజాగా పుష్ప ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ ఈ కాంట్రవర్సరీపై స్పందించారు.
మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అంటూ సాగే ఐటెం సాంగ్ లిరిక్స్‌పై వస్తున్న వివాదాలపై మీ స్పందన ఏంటి అని ఓ రిపోర్టర్ బన్నీని ప్రశ్నించగా.. 'లిరిక్స్‌లో తప్పు లేదు, ఇదే నిజం' అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా పుష్ప ఈ రోజు(డిసెంబర్ 17న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.