Allu Arjun : టాలీవుడ్ ఫస్ట్ సిక్స్ ప్యాక్ మూవీ రీ రిలీజ్ అవుతోంది

Update: 2025-04-26 07:45 GMT

తెలుగులో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసిన హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ అని ఎవరైనా చెబుతారు. అప్పటికే బాలీవుడ్ లో ఈ ట్రెండ్ బాగా విస్తరించింది. ప్రతి హీరో సిక్స్ ప్యాక్ అంటున్నాడు. ఆ ట్రెండ్ ను టాలీవుడ్ కు మొట్టమొదట పరిచయం చేసింది అల్లు అర్జున్. దీంతో అప్పటి వరకూ కాస్త చబ్బీగా ఉన్న మన తెలుగు హీరోలు బన్నీని చూసి వాళ్లూ కండలు పెంచడం మొదలుపెట్టారు. ఒక్క మహేష్ బాబు తప్ప స్టార్ హీరోల్లో అందరూ సిక్స్ ప్యాక్ ను ప్రదర్శించిన వారే. ఇంతకీ అల్లు అర్జున్ చూపించిన ఆ ఆరుపలకల దేహం ఏ సినిమాలోదో తెలుసు కదా.. యస్.. దేశ ముదురు.

పూరీ జగన్నాథ్ వీర ఫామ్ లో ఉండగా రూపొందిన సినిమా దేశముదురు. ఆ ఫామ్ కు తగ్గట్టుగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాదు కానీ.. డీసెంట్ హిట్ గా నిలిచింది. హన్సిక ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. అలీ, కోవై సరళ కామెడీ హైలెట్ గా నిలిచిన ఈ చిత్రంలోని అలీ ట్రాక్ ఎవర్ గ్రీన్ అనిపించుకుంది. ఇప్పుడిదంతా ఎందుకూ అంటారా.. సింపుల్.. ఈ దేశముదురును కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. 2007 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రాన్ని మే 10న దేశ ముదురు చిత్రాన్ని మళ్లీ విడుదల చేయబోతున్నారు. మరి ఈ సారి ఎలాంటి అప్లాజ్ అందుకుంటుందో కానీ.. ఈజీగా మరోసారి చూసేయొచ్చు ఈ చిత్రాన్ని.

Tags:    

Similar News