Allu Ramalingaiah: తాతయ్యకు ప్రేమతో.. : బన్నీ బర్త్‌ డే గిప్ట్

Allu Ramalingaiah: అల్లు రామలింగయ్య తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన నటుడు.

Update: 2021-10-01 09:01 GMT

Allu Ramalingaiah: దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య 100 వ జయంతి సందర్భంగా తన తాత పద్మశ్రీ అల్లు రామలింగయ్య విగ్రహాన్ని అల్లు స్టూడియోలో ఆవిష్కరించారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. విగ్రహం ఆవిష్కరణలో అల్లు సోదరులు బాబీ, శిరీష్ కూడా పాల్గొన్నారు.

"అల్లు స్టూడియోస్ లో మా తాత పద్మశ్రీ #అల్లు రామలింగయ్య గారి విగ్రహాన్ని ఈరోజు #AlluBobby & @AlluSirish తో కలిసి ఆవిష్కరించాను. ఆయన మా తాత కావడం మాకు గర్వకారణం. మా ప్రయాణంలో ఆయన భాగం అవుతాడు "అని అల్లు అర్జున్ ట్వీట్ చేసారు.

అక్టోబర్ 1, 1922 న జన్మించిన అల్లు రామలింగయ్య తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన నటుడు. బ్లాక్ అండ్ వైట్ యుగంలో స్టార్‌డమ్‌కి ఎదిగిన అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో అల్లు రామలింగయ్య ఒకరు. ఐదు దశాబ్దాలకు పైగా చిత్ర సీమలో రాణించిన ఆయన 1000 సినిమాలకు పైగా నటించారు.

కళామతల్లికి చేసిన కృషికిగాను అల్లు రామలింగయ్యకు 2001 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డును అందజేశారు. 1990 సంవత్సరానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష కృషి చేసినందుకు ఆయన పద్మశ్రీని అందుకున్నారు. 1999 లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ కోసం సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.



Tags:    

Similar News