Amitab Batchan: అమితాబ్ బచ్చన్ కొత్త చిత్రం.. సెక్షన్ 84

Amitab Batchan: అమితాబ్ బచ్చన్ సెక్షన్ 84 పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇది కోర్ట్‌రూమ్ థ్రిల్లర్, దీనికి రిభు దాస్‌గుప్తా దర్శకత్వం వహించనున్నారు.

Update: 2023-03-01 11:43 GMT

Amitab Batchan: అమితాబ్ బచ్చన్ సెక్షన్ 84 పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇది కోర్ట్‌రూమ్ థ్రిల్లర్, దీనికి రిభు దాస్‌గుప్తా దర్శకత్వం వహించనున్నారు. లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ 80 ఏళ్ళ వయసులోను ఎంతో ఉత్సాహంగా నటిస్తున్నారు. వర్క్‌ని ఎంతో ప్రేమిస్తారు. అందుకే ఈ వయసులోనూ ఉత్సాహంగా పని చేయగలుగుతున్నారు. ఫీల్ గుడ్ ఉంఛై తర్వాత, బిగ్ బి సెక్షన్ 84 పేరుతో కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌‌లో నటించనున్నారు. అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేస్తూ, "ఈ కొత్త వెంచర్ కోసం నేను ఆసక్తిగా ఉన్నాను. సృజనాత్మక వ్యక్తులతో కలిసి ఉండటం ఆనందంగా ఉంది అని ట్వీట్ చేశారు.

రిభు, నిర్మాత వివేక్ సెక్షన్ 84 గురించి మాట్లాడుతూ.. అమితాబ్ బచ్చన్‌తో సెక్షన్ 84 గురించి దర్శకుడు రిభూ దాస్‌గుప్తా మాట్లాడుతూ, "నేను సర్‌తో మళ్లీ కలిసి పని చేయడం సంతోషంగా, గౌరవంగా భావిస్తున్నాను. నిర్మాత వివేక్ బి అగర్వాల్ (రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్), "మా తదుపరి చిత్రంలో మిస్టర్ బచ్చన్‌ ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. సెక్షన్ 84లో అతను రిభుతో కలిసి ఈ సాహసయాత్రను ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. "అని అన్నారు. సెక్షన్ 84ను రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ జియో స్టూడియోస్‌తో కలిసి అందిస్తోంది. 

Tags:    

Similar News