Ananya Nagalla : అనన్య నాగళ్ల పొట్టేల్.. గ్రామీణ నేపథ్యంలో కొత్త సినిమా
యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'పొట్టేల్'. సాహిత్ మోతూరి దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ కు మంచి స్పందన వచ్చిందని చిత్రబృందం అంటోంది. నాలుగు పాటలు విడుదల చేయగా అవి ఆదరణపొందాయి.
అనన్య నాగళ్ల పుట్టినరోజు సందర్భంగా.. ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. ఇందులో అనన్య గ్రామీణ యువతిగా కనిపిస్తోంది. ఇందులో అభినయానికి అవకాశం వున్న పాత్రలో కనిపించనుంది. బుజ్జమ్మగా ఆమె పాత్రఆకుంటుంది. ఈ సినిమాలో అజయ్ ఓ ముఖ్యపాత్రని పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సిడిగే నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం, ఛాయాగ్రహణం మోనిష్ భూపతిరాజు అందిస్తున్నారు. ఇతర పాత్రల్లో ప్రియాంకశర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, ఛత్రపతి శేఖర్, జీవన్, రియాజ్ తదితరులు నటిస్తున్నారు.